టాప్ 8 చైల్డ్ హ్యాకర్లు ఎవరో తెలుసా?

By Anil

  కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు,డబ్బు కొసం మరికొందరు,సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్ని దొంగిలిస్తున్నారు.అయితే హ్యాకింగ్ చేయడం లో కొందరు చిన్నారులు కూడా ఆరితేరి పోయారు. ఈ నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న 8 మంది చిన్న వయస్సు గల హ్యకర్ల గురించి మీకు తెలుపుతున్నాము.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Kristoffer Von Hassel (5 సంవత్సరాలు )...

  Kristoffer von Hassel ప్రపంచంలోనే అతి చిన్న వయస్సు గల హ్యాకర్. ఈ బుడ్డోడి వయస్సు 5 సంవత్సరాలు. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ యొక్క సెక్యూరిటీ టెక్ సెంటర్ జాబితా చేసిన అతి పిన్నవయస్కుడైన "security researcher".ఎవరు ఓపెన్ చేయాలనీ Xbox Live యొక్క authentication స్క్రీన్ ను ఓపెన్ చేసి చూయించాడు. థిరియొటికల్ గాఈ గేమ్స్ ను ఎవరు యాక్సిస్ చేయలేరు.BBC మరియు ఇతర మీడియా నివేదించిన ప్రకారం, ఈ బుడ్డోడు ఎలాంటి పాస్వర్డ్ లను దొంగిలించలేదు. పాస్ వర్డ్ ధృవీకరణ కనిపించినప్పుడు, అతను పదేపదే స్పేస్ బార్ని నొక్కి, 'Enter' ను హిట్ చేసి, తన తండ్రి ఖాతాలోకి ప్రవేశించి, యుట్యూబ్ నుండి వీడియోలను చూడటానికి మరియు వయస్సుకు పరిమితం చేయటానికి అనుమతిచ్చాడు.

  Reuben Paul (9 సంవత్సరాలు )...

  Reuben Paul ఒక ethical హ్యాకర్. ఈ అబ్బాయి వయస్సు 9 సంవత్సరాలు.ఈ Reuben Paul కేవలం 15 నిమిషాలలో ఆండ్రాయిడ్ ఫోన్ లోని కాంటాక్ట్స్ ,కాల్ లాగ్స్ మరియు House hold గూడ్స్ ను దొంగిలించాడు . ప్రస్తుతం ఈ అబ్బాయి Prudent games అనే సంస్థ కు CEO గ వ్యవహరిస్తున్నాడు.

  Betsy Davies(7 సంవత్సరాలు )...

  Betsy Davies ఓపెన్ వైఫై నెట్వర్క్ ను హ్యాక్ చేయడం లో దిట్ట. ఈ అమ్మాయి వయసు 7 సంవత్సరాలు. కేవల 10 నిమిషాల 54 సెకండ్లలో వైఫై నెట్వర్క్ లో ఉన్న ఒకరి ట్రాఫిక్ ను దొంగిలించింది. నెట్వర్క్ హాక్ మరియు రోగ్ యాక్సెస్ పాయింట్ ఏర్పాటు గురించి Youtube లో ఒక ట్యుటోరియల్ చూసి ఇదంతా చేసింది.

  ACK! 3STX (15 సంవత్సరాలు )...

  ACK! 3STX ఆస్ట్రియా కు చెందిన ఈ హ్యాకర్ వయసు 15 సంవత్సరాలు. కేవలం 3 నెలలోనే 257 కంపెనీ సైట్లను హ్యాక్ చేసాడు.సాఫ్ట్ వేర్ ఫెయిల్ అయ్యాక ఆస్ట్రియన్ పోలీసులు కనుగొని అరెస్టు చేశారు.

  Unknown Canadian Hacker....

  2014లో ఓ 11సంవత్సరాలు వయసు కలిగిన అబ్బాయి కెనడియన్ ప్రభుత్వ వెబ్సైట్లకు వ్యతిరేకంగా వరసగా DDoS పై దాడులు చేయడం ప్రారంభించాడు. ఈ అబ్బాయి ప్రభుత్వ వెబ్సైట్ల Home page ను ఎడిట్ చేసేవాడు. ఈ అబ్బాయి దెబ్బకి 2 రోజులు ప్రభుత్వ వెబ్ సైట్స్ అన్ని రెండు రోజులు క్లోజ్ చేసారు. దీని వల్ల కెనడియన్ ప్రభుత్వం 260 వేల డాలర్ల నష్టం జరిగింది.

  CyFi...

  ఆండ్రాయిడ్ మరియు ios గేమ్స్ హ్యాక్ చేసినప్పుడు CyFi వయస్సు 10 సంవత్సరాలు. 2011 లో DefCon 19 వద్ద డెఫ్కోన్ కిడ్స్ లో ఆమె ప్రేక్షకులతో మాట్లాడుతూ గేమ్ పూర్తిగా కంప్లీట్ చేయడానికి చాల సమయం పడుతుంది అని అది చాలా బోరింగ్ గా ఉంటుంది అని గేమ్ ను పూర్తి చేయడం కోసాం కొన్ని మార్గాలను అన్వేషించినట్టు చెప్పింది.ఇందులో భాగంగా ఆమె తన పరికరం యొక్క గడియారాన్ని manual గా పెంచి గేమ్ లో ముందుకు సాగడం ప్రారంభించింది.

  Michael Calce...

  Michael Calce ను "మాఫియా బాయ్" గా పిలిచేవారు. అతను 15 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 'రివల్టా' సిరీస్ ను లాంచ్ చేసాడు.ఇందులో భాగంగా ఇబే, అమెజాన్, డెల్, మొదలైన కొన్ని ప్రసిద్ధ వెబ్సైట్ల సర్వర్లను ఓవర్ లోడ్ చేయడం ప్రారంభించాడు.ఈ హ్యాకర్ వల్ల కంపెనీలకు $ 7.5 మిలియన్ల నష్టం జరిగింది.

  Jonathan James...

  Jonathan Jamesను హ్యాకర్ ప్రపంచంలో 'C0mrade' అని పిలిచేవారు .16 సంవత్సరాల వయస్సులో, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యొక్క డిఫెన్స్ థ్రెట్ రిడక్షన్ ఏజన్సీ, NASA, మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకొని హ్యాక్ చేసేవాడు.

   

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Hackers may be motivated by a multitude of reasons, such as profit, protest, challenge, enjoyment, or to evaluate those weaknesses to assist in removing them. So, meet the world’s most interesting and dangerous child hackers.
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more