మోత మోగించిన మార్కెట్ షేర్!

Posted By: Prashanth

మోత మోగించిన మార్కెట్ షేర్!

 

2011-12 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి టాబ్లెట్ పీసీల మార్కెట్లో ఆపిల్ గణనీయమైన మార్కెట్ షేర్‌ను నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతైన ప్రతి 10 టాబ్లెట్ కంప్యూటర్లలో 6 ఆపిల్ ఐప్యాడ్‌లు ఉండటం బ్రాండ్ డిమాండ్‌ను సూచిస్తుంది. ప్రముఖ పరిశోధన సంస్థ ‘ఐహెచ్ఎస్ ఐసప్లీ’నిర్వహించిన అధ్యయనం మేరకు 2011-12 ఆర్ధిక సంవత్సరానికి‌గాను అత్యధికంగా టాబ్లెట్ పీసీలను ఎగుమతి చేసిన ఉత్తమ ఐదు కంపెనీల వివరాలు...

* ఆపిల్ (ఐప్యాడ్ రూపకర్త):

ప్రపంచవ్యాప్తంగా చేసిన ఎగుమతులు: 40.5 మిలియన్, సాధించిన మార్కెట్ షేర్: 62 శాతం.

* సామ్‌సంగ్ (గెలాక్సీ టాబ్లెట్ల రూపకర్త)

ప్రపంచవ్యాప్తంగా చేసిన ఎగుమతులు: 6.1 మిలియన్, సాధించిన మార్కెట్ షేర్ : 9 శాతం.

* ఆమోజన్.కామ్ (కిండిల్ ఫైర్ టాబ్లెట్ పీసీ రూపకర్త)

ప్రపంచవ్యాప్తంగా చేసిన ఎగుమతులు : 3.9 మిలియన్. సాధించిన మార్కెట్ షేర్ : 6 శాతం.

* బార్నెస్ అండ్ నోబుల్ (నూక్ టాబ్లెట్ కంప్యూటర్ల రూపకర్త)

ప్రపంచవ్యాప్తంగా చేసిన ఎగుమతులు : 3.3 మిలియన్, సాధించిన మార్కెట్ షేర్: 5 శాతం

* అసస్ టెక్ కంప్యూటర్ ( ట్రాన్స్ ఫార్మర్ లైన్ టాబ్లెట్ పీసీల రూపకర్త)

ప్రపంచవ్యాప్తంగా చేసిన ఎగుమతులు: 2.1 మిలియన్, సాధించిన మార్కెట్ షేర్ : 3 శాతం

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot