Just In
- 37 min ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 18 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 20 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 23 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టే.. యూజీసీ కొత్త నిబంధన; ఇకపై విద్యార్థులకు అది తప్పనిసరి!!
- Movies
Waltair Veerayya's Day 18 Collections.. 250 కోట్లకు చేరువగా.. 18వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఎంత లాభమంటే?
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Finance
Budget Market: మార్కెట్ పెరుగుతుందా.. పడిపోతుందా..? గత బడ్జెట్లలో ఏం జరిగిందంటే..
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అనిల్ అంబానికు మళ్లీ కొత్త తిప్పలు, అన్న చేయూతనిచ్చినా.. ?
అనిల్ అంబాని గ్రూప్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. అన్న జియో అధినేత రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను కొనుగోలు చేసి అప్పులను తీర్చాలనే ఆలోచనలో ఉండగా కోర్టు ఝలక్ ఇచ్చింది. 38 వేల కోట్ల రూపాయల రుణభారంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ తమ అనుమతి తీసుకోకుండా ఆస్తులను విక్రయుంచడం, బదిలీ చేయడం, విక్రయంపై ఇతరులకు అధికారం కట్టబెట్టడం వంటి చర్యలకు పాల్పడరాదని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. టెలికాం గేర్ తయారీ సంస్థ ఎరిక్సన్ ఇండియా అప్పీలును పురస్కరించుకుని జస్టిస్ స్వతంత్రకుమార్, జస్టిస్ ఎస్‌బి సిన్హా, జస్టిస్ విఎస్ సిర్‌పూర్కర్ సభ్యులుగా గల ట్రిబ్యునల్ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఎరిక్సన్ సంస్థ
అనిల్ అంబానీ నాయకత్వంలోని ఆర్ కామ్ చెల్లించాల్సిన భారీ బకాయిల నుంచి తమకు ఊరట కల్పించాలని కోరుతూ ఎరిక్సన్ సంస్థ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.

ఆర్‌కామ్‌కు చెందిన..
ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసేందుకు ముకేశ్ అంబానీ యాజమాన్యంలోని ఆర్‌జియో కుదుర్చుకున్న అంగీకారం ఈ మార్చి నాటికి పూర్తి కావలసి ఉన్న తరుణంలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఊరట కలిగించకపోతే..
ఆర్‌కామ్ చర్యల నుంచి తమకు ఊరట కలిగించకపోతే కోలుకోలేని నష్టం జరుగుతుందన్న ఎరిక్సన్ వాదంతో తాము ఏకీభవిస్తున్నామని, చట్టం పరిధిలో ఉన్న రక్షణను ఆ సంస్థకు నిరాకరించలేమని వారు పేర్కొన్నారు.

1200 కోట్ల రూపాయల మేరకు..
1200 కోట్ల రూపాయల మేరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు ఆర్‌కామ్ అంగీకరించిందని, దానికి తోడు ఎన్ని లేఖలు పంపినా 1012 కోట్ల రూపాయల బకాయిని చెల్లించలేదని ఎరిక్సన్ నివేదించింది.

2017 డిసెంబర్‌లో..
కాగా 2017 డిసెంబర్‌లో తన ఆస్తులను జియో ఇన్ఫోకామ్‌కు విక్రయించి అప్పులు తీర్చాలనే ప్రణాళికను ఆర్‌కామ్ ప్రకటించింది. ఇప్పటికే ఆర్‌కామ్ వివిధ బ్యాంకులకు రూ.45, 516 కోట్ల బకాయిలు ఉంది.

కోర్టు నుంచి వచ్చిన విషయంపై
అయితే కోర్టు నుంచి వచ్చిన విషయంపై అటు జియోకానీ, ఇటు రిలయన్స్ కమ్యూనికేషన్ కానీ స్పందించలేదు. మరి ముందు ముందు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏ తీరాలకు చేరుతుందనే విషయం మీద ఎటువంటి క్లారిటీ రావడం లేదు.

ఏడాదికి రూ. 6400 కోట్లను..
కాగా మొబైల్ బిజినెస్ రంగాన్ని అన్నకి అప్పజెప్పిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబాని సరికొత్త వ్యాపార సామ్రాజ్యంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సముద్రం అడుగున కేబుల్స్ వేయడం ద్వారా కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఏడాదికి రూ. 6400 కోట్లను ఆర్జించే లక్ష్యంగా ఇప్పుడు పావులు కదుపుతున్నారు.

సముద్ర భూభాగ కేబుల్ వ్యవస్థను..
వైర్‌లెస్ వ్యాపారాన్ని మూసివేస్తున్నామని, వ్యాపార సంస్థలకు (బీ 2 బీ) సేవలందించడంపైనే దృష్టి సారిస్తామని ఇటీవలే ప్రకటించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇప్పుడు సముద్రం లోపల 68 వేల కిలోమీటర్ల పొడవైన సముద్ర భూభాగ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.

సుమారు రూ.6,400 కోట్ల ఆదాయం..
సముద్రం అడుగున 68,000 కిలోమీటర్ల పొడవునా నిర్మించే కేబుల్ ద్వారా ఏటా బిలియన్ డాలర్ల (సుమారు రూ.6,400 కోట్ల) ఆదాయం లభించగలదని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అంచనా వేస్తోంది.

కొత్త పెట్టుబడి ప్రణాళికలను..
ఈ నేపథ్యంలోనే కొత్త పెట్టుబడి ప్రణాళికలను కొత్త ఆర్‌కామ్ వెల్లడించింది. ఇందుకోసం సంస్థ 60 కోట్ల డాలర్లు (మన కరెన్సీలో రూ.3,840 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ సబ్‌మెరైన్ కేబుల్ ద్వారా భారత్‌లోని తన కేంద్రాన్ని పశ్చిమాన ఇటలీని, తూర్పున హాంకాంగ్‌ను అనుసంధానం చేయనుంది.

గ్లోబల్ క్లౌడ్ ఎక్స్ఛేంజ్' ద్వారా..
వంద శాతం వాటా కలిగిన అనుబంధ విభాగమైన ‘గ్లోబల్ క్లౌడ్ ఎక్స్ఛేంజ్' ద్వారా ఆర్‌కామ్ ఈ కేబుల్ వ్యవస్థను నిర్మిస్తున్నది. తమ ప్రధాన కార్యాలయం నుంచి హాంకాంగ్, ఐరోపా దేశాలకు డేటా బదిలీకి వీలు కల్పించేలా ఈ నిర్మాణం కొనసాగనుంది.

ఐదేళ్లలో మూడింతలయ్యే అవకాశం..
ఇది పూర్తయితే ఏటా రూ.6,400 కోట్ల ఆదాయం లభిస్తుందన్నది సంస్థ అంచనా. ఈ నెట్‌వర్క్ ద్వారా అనుబంధ విభాగం ఆదాయం ఐదేళ్లలో మూడింతలయ్యే అవకాశం ఉందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో ఆర్‌కామ్ పేర్కొంది.ఏటా 100 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించగల సత్తా కలిగిన ఈ కేబుల్ వ్యవస్థ 2020లో మూడో త్రైమాసికానికల్లా అందుబాటులోకి వస్తుందని ఆర్‌కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్‌బార్నే తెలిపారు.

సవాలుగా స్వీకరించి..
తమ కేబుల్ భారత్ నుంచి ఇటలీకి, హాంకాంగ్‌కు ఉంటుందని, రాబోయే అయిదేళ్లలో నిర్మాణం పూర్తయ్యాక, అధిక ఆదాయం ఆర్జిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.వ్యాపార సంస్థలకు సేవలందించే ఎంటర్‌ప్రైజ్ కంపెనీని ప్రారంభించడం సవాలేనని, మొత్తం వ్యాపారంలో ఎంటర్‌ప్రైజ్ కంపెనీ వాటా 10-15 శాతమేనంటూ దీనిని సవాలుగా స్వీకరించి ముందడుగు వేస్తామని తెలిపారు.

30 మంది వరకు భాగస్వాములు..
ఈ ప్రాజెక్టులో 30 మంది వరకు భాగస్వాములుంటారని, అందువల్ల ముందస్తు విక్రయాల ద్వారానే 700 మి.డాలర్లు (సుమారు రూ.4,500 కోట్లు) ఆర్జించగలమని పేర్కొన్నారు.ఇప్పటికే ఆలీబాబా సహా ఆరుగురితో ఒప్పందం చేసుకున్నామని, 300 మి.డాలర్ల పెట్టుబడికి హామీలు లభించాయన్నారు. రూ.45 వేల కోట్ల మేర అప్పులభారంతో సతమతమవుతున్న ఆర్‌కామ్.. ఈ మధ్యనే మొబైల్ సేవల వ్యాపారం నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470