‘మిజు ఎం6 నోట్’ ఇండియాకు వస్తోంది..

|

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ మిజ మరో శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. మిజు ఎం6 నోట్ పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిట్ ఫోన్‌కు సంబంధించి, ఓ టీజర్ ఇమేజ్‌ను తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మిజు పోస్ట్ చేసింది.

 
‘మిజు ఎం6 నోట్’ ఇండియాకు వస్తోంది..

ఈ టీజర్ ఇమేజ్‌ ప్రకారం మిజు ఎం6 నోట్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో రాబోతోంది. కొత్త ఏడాది కానుకుగా, మిజు ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముంది. ఎం6 నోట్‌‌తో పాటు ప్రో 7 స్మార్ట్‌ఫోన్‌ను కూడా మిజు అందుబాటులోకి తీసుకురాబోతోంది.

మిజు ఎం6 నోట్ ఇప్పటికే చైనా మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. ఈ ఫోన్‌ను మూడు రకాల వేరియంట్‌లలో అందుబాటులో ఉంచారు. 3జీబి ర్యామ్ + 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ (ధర రూ.10,570), 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ (ధర రూ.12,500), 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ (ధర రూ.16,350).

మిజు ఎం6 నోట్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఫ్లైమ్ ఓఎస్ 6, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం.

పానాసోనిక్ నుంచి మరో బడ్జెట్ ఫోన్పానాసోనిక్ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ (ప్రత్యేకతలు : హై-ఎండ్ సోనీ ఐఎమ్ఎక్స్362 సెన్సార్, డ్యుయల్-టోన్ క్వాడ్-ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/1.9 అపెర్చుర్, 1.4యూఎమ్ పిక్సల్ సైజ్, 6పీ లెన్స్), 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ఎఫ్/2.0 అపెర్చుర్, 5పీ లెన్స్), 4000 mAh బ్యాటరీ విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఎమ్‌టచ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ నెట్ వర్క్ విత్ VoLTE సపోర్ట్, బ్లటూత్ .1, వై-ఫై, జీపీఎస్.

Best Mobiles in India

Read more about:
English summary
The Meizu M6 Note features rear dual cameras with quad LED flash.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X