మిక్సిడ్ రియాలిటీ హెడ్‌సెట్‌పై మెటా కీలక ప్రకటన.. ఆపిల్‌కు పోటీగా!!
టెక్ దిగ్గజం మెటా నుంచి కీలక ప్రకటన వెలువడింది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మిక్సిడ్ రియాలిటీ హెడ్‌సెట్‌పై గురించి వెల్లడించారు. క్విస్ట్ 3 కలర్ మిక్సి్డ్ రియాలిటీ హెడ్‌సెట్ త్వరలో పూర్తివివరాలు వెల్లడిస్తామని తెలిపారు. జూన్ 5 నుంచి జరగనున్న ఆపిల్ WWDCలో మిక్సిడ్ రియాలిటీ హెడ్‌సెట్ లాంచ్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో మెటా నుంచి ఇటువంటి కీలక ప్రకటన వచ్చింది.
మెటా క్విస్ట్3 ఏఆర్/వీఆర్ (ఆగ్‌మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ ) మిళితం చేస్తుందని సంస్థ తెలిపింది. ఇదివరకే విడుదలైన హెడ్‌సెట్‌ల కంటే 40% సన్నగా ఉంటుందని సమాచారం. ఈ మిక్సిడ్ రియాలిటీ హెడ్‌సెట్ ధర రూ.41,000 వరకు ఉండే అవకాశం ఉంది.

త్వరలో రానున్న క్విస్ట్ 3 అప్‌గ్రేడ్ చేయబడిన క్వాల్‌కాం చిప్‌సెట్‌తో వస్తుందని మార్క్ జూకర్ బర్గ్ వెల్లడించారు. ముందుగా వచ్చిన హెడ్‌సెట్‌ల కంటే రెట్టింపు గ్రాఫిక్స్ అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ఈ హెడ్‌సెట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సెప్టెంబర్ 27న నిర్వహించనున్న సంస్థ వార్షిక ఏఆర్/వీఆర్ సమావేశంలో వెల్లడిస్తామన్నారు.
ప్రస్తుతం మెటా సంస్థకు వీఆర్ హెడ్‌సెట్ మార్కెట్‌లో గట్టి పట్టుంది. ఆ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి క్విస్ట్ 3 మిక్సిడ్ రియాలిటీ హెడ్‌సెట్‌పై ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. 2022లో 8.8 మిలియన్ వర్చువల్ హెడ్‌సెట్‌లు విక్రయాలు జరిగినట్లు మార్కెట్ పరిశోధన సంస్థ IDC తెలిపింది. అందులో 80% మెటా హెడ్‌సెట్‌లే ఉన్నట్లు అంచనా వేసింది.
మెటా నుంచి ఇప్పటికే విడుదలైన ఎంట్రీ లెవల్ క్విస్ట్ 2.. 128GB వెర్షన్ ధరను 2022 జులైలో పెంచిన సంస్థ.. ఈ మార్చిలో క్విస్ట్ హెడ్‌సెట్‌ల ధరలను తగ్గించింది. హై ఎండ్ మెటా క్విస్ట్ ప్రో విడుదల చేసిన సమయంలో హెడ్‌సెట్ ధర 1500 డాలర్లుగా (రూ.1,23,473) ఉండేది. ప్రస్తుతం ధర 1000 (రూ.82,315.50) డాలర్లకు తగ్గింది.
అదేవిధంగా క్విస్ట్2 256GB వెర్షన్ విడుదల సమయంలో 500 (రూ.41,157) డాలర్లుగా ఉండేది. ప్రస్తుతం 430 (రూ.35,395) డాలర్లుగా ఉంది. జూన్ 4వ తేదీ నుంచి క్విస్ట్2 ధర మరింత తగ్గనుందని సంస్థ వెల్లడించింది. ఎంట్రీ లెవల్ వెర్షన్ ధర 300 డాలర్లు (రూ, 24,694), 256GB వెర్షన్ ధర 350 (రూ. 28810) డాలర్లకు విక్రయిస్తామని తెలిపింది.
ఆపిల్ మిక్సిడ్ రియాలిటి హెడ్‌సెట్‌ను జూన్ 5 నుంచి 9 వరకు జరగనున్న WWDC సమావేశాల్లో విడుదల చేస్తారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతలోనే పోటీగా మెటా కీలక ప్రకటన చేసింది. అయితే ఆపిల్ హెడ్‌సెట్ విడుదల తర్వాత ఎవరు గట్టి పోటీనిస్తారో చూడాల్సి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications