ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో రీల్స్‌ని చేస్తున్నారా? ఈ కొత్త ఎడిట్ టూల్స్‌ గురించి తెలుసుకోండి..

|

మెటా యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా యాప్ లు ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్‌ టిక్‌టాక్‌తో పోటీపడడానికి రీల్స్‌ను తీసుకొనివచ్చింది. ఇప్పుడు ఈ రీల్స్‌లో మరికొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేయడం ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్‌లు క్రియేటర్‌లకు మరిన్ని ఎడిటింగ్ టూల్స్ అందించడమే కాకుండా అధిక సమయం గల వీడియోలను అప్‌లోడ్ చేయడానికి మరియు వారి అప్‌లోడ్‌లను షెడ్యూల్ చేయడానికి కూడా వీలు కల్పిస్తాయి. టిక్‌టాక్‌తో పోటీ పడేందుకు కంపెనీ అందిస్తున్న ఈ ఫీచర్లు యూజర్లకు మరపురాని అనుభవాన్ని అందిస్తాయి అని మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్‌లోని రీల్స్‌లో కొత్తగా చేరిని ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫేస్‌బుక్‌లోని రీల్స్ కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని రీల్స్ కొత్త ఫీచర్లు

డెస్క్‌టాప్‌లో రీల్స్‌ని సృష్టించండి మరియు షెడ్యూల్ చేయడం

ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్‌లో ఫేస్‌బుక్ రీల్స్‌ను సృష్టించడంతో పాటుగా ఇప్పుడు ఫేస్‌బుక్ క్రియేటర్ స్టూడియో ద్వారా కూడా వెబ్ బ్రౌజర్‌ల నుండి ఫేస్‌బుక్ కొత్త రీల్స్‌ను సృష్టించడం, సవరించడం మరియు పబ్లిష్ చేయడం వంటివి చేయగలరని మెటా సంస్థ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. దీనితో పాటు వారు ఫేస్‌బుక్‌లో తమ రీల్స్‌ను షెడ్యూల్ కూడా చేయగలుగుతారు.

 

రీల్స్‌లో క్లిప్‌లు

రీల్స్‌లో క్లిప్‌లు

ఫేస్‌బుక్‌ డెస్క్‌టాప్ వెర్షన్ లో మెటా సంస్థ కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది. ఇది వినియోగదారులు సృష్టించిన అధిక సమయం వీడియోల నుండి క్లిప్‌లను సృష్టించడానికి అనుమతిస్తుంది. క్రియేటర్ స్టూడియో ద్వారా వాటిని ఫేస్‌బుక్‌ రీల్‌లో సజావుగా సవరించడానికి వీలు కల్పిస్తుంది. గేమింగ్ వీడియో సృష్టికర్తల కోసం కంపెనీ వారి లైవ్ కంటెంట్ నుండి నేరుగా షార్ట్-ఫారమ్ రీల్స్‌ను రూపొందించడానికి అనుమతించే కొత్త ఎడిటింగ్ టూల్లను విడుదల చేస్తోంది. "క్రియేటర్‌లు ఇప్పుడు గేమ్‌ప్లే మరియు క్రియేటర్ క్యామ్ రెండింటి వీక్షణలతో లైవ్ క్లిప్‌లను నిలువుగా 60-సెకన్ల ఫార్మాట్‌కి తగ్గించవచ్చు" అని కంపెనీ తన బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది.

కొత్త ఆడియో టూల్స్

కొత్త ఆడియో టూల్స్

ఫేస్‌బుక్ రీల్స్ ఇప్పుడు వినియోగదారుల రికార్డింగ్‌ల కోసం వాయిస్‌ఓవర్‌లకు మద్దతును అందుబాటులోకి తీసుకొనిరానున్నది. తద్వారా వారు తమ వీడియోలను ముందు కంటే మెరుగ్గా సృష్టించవచ్చు అని మెటా తెలిపింది. కంపెనీ 'సౌండ్ సింక్' అనే మరొక కొత్త ఫీచర్‌ను కూడా ప్రారంభించింది. ఇది వారి వీడియో క్లిప్‌లను వారికి ఇష్టమైన పాటకు సమకాలీకరించడానికి వీలు కల్పిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కొత్త ఫీచర్లు

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కొత్త ఫీచర్లు

90 సెకన్ల నిడివి గల వీడియోలు

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ యొక్క నిడివిని ఇప్పుడు ఉన్న 60 సెకన్ల నుండి 90 సెకన్లకు విస్తరించింది. దీని వలన సృష్టికర్తలు తమ కంటెంట్‌ను సులభంగా మరియు వివరణాత్మకంగా పంచుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుంది.

స్టిక్కర్లు

రీల్స్‌లను సృష్టించే వారిలో అత్యంత ప్రజాదరణ పొందిన స్టోరీస్ స్టిక్కర్‌లను ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో తీసుకువస్తున్నట్లు మెటా సంస్థ తెలిపింది. ఈ జాబితాలో పోల్స్ స్టిక్కర్‌లు, క్విజ్ స్టిక్కర్లు మరియు ఎమోజి స్లైడర్ వంటి స్టిక్కర్‌లు చాలానే ఉన్నాయి.

 

Importing audio

Importing audio

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ని అధికంగా సృష్టించడానికి ఇష్టపడే సృష్టికర్తలు ఇప్పుడు తమ స్వంత ఆడియోను నేరుగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో దిగుమతి చేసుకోవచ్చని మెటా సంస్థ తెలిపింది. "మీ కెమెరా రోల్‌లో కనీసం 5 సెకన్ల నిడివి ఉన్న ఏదైనా వీడియో లో బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ని జోడించడానికి 'Importing audio' ఫీచర్‌ను ఉపయోగించండి" అని కంపెనీ జోడించింది.


టెంప్లేట్‌లు

ఇన్‌స్టాగ్రామ్‌లో టెంప్లేట్‌లు అనే ఫీచర్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు మెటా సంస్థ తెలిపింది. ఇది మీరు చూసిన రీల్‌తో సమానమైన నిర్మాణాన్ని ఉపయోగించి వినియోగదారులు వారి స్వంత రీల్‌ను సృష్టించడానికి అనుమతిస్తుంది. "మీరు పునఃసృష్టి చేయాలనుకుంటున్న రీల్‌ను చూసినప్పుడు ఆడియో మరియు క్లిప్ సీక్వెన్స్‌ని లాగడానికి 'టెంప్లేట్‌ని ఉపయోగించవచ్చు. మీరు దానిని జోడించడం మరియు కత్తిరించడం ద్వారా మీ స్వంత కంటెంట్‌తో అనుకూలీకరించవచ్చు "అని మెటా సంస్థ తెలిపింది.

 

Best Mobiles in India

English summary
Meta Company Introduces New Edit Tools on Instagram and Facebook Reels

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X