Home
News

మెటా నుంచి కొత్త AI యాప్‌.. వాయిస్‌ ద్వారా సులభంగా ఉపయోగించుకోవచ్చు..!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రోజురోజుకు మరింత అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది యూజర్లు వివిధ AI టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. టెక్‌ దిగ్గజం మెటా (Meta) ఇప్పటికే తమ అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో AI ను ఇంటిగ్రేట్‌ చేసింది. దీంతోపాటు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, మెసేంజర్‌ ద్వారా ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా మెటా కొత్త AI యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌ Llama 4 ఆధారంగా పనిచేస్తుంది.

తొలి వెర్షన్‌గా విడుదల : మెటా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఇప్పటికే అనేక విధాలుగా AI ను ఉపయోగించుకున్నారు. తాజాగా విడుదల అయిన యాప్‌ను వాయిస్‌ ద్వారా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌ను తొలి వెర్షన్‌గా తీసుకొచ్చామని, యూజర్లు నుంచి వచ్చే ఫీచ్‌బ్యాక్‌ ద్వారా మరింత మెరుగుపరుస్తామని సంస్థ తెలిపింది.

Meta launched Llama 4 based AI app

ఇన్ బిల్ట్‌ వెబ్‌ సెర్చ్‌ : Llama 4 ద్వారా పనిచేసే మెటా AI యాప్ యూజర్ల ప్రశ్నలకు, వారి సమస్యలకు సరైన సమాధానాలు అందిస్తుందని సంస్థ చెబుతోంది. ఈ యాప్‌లో వెబ్‌ సెర్చ్‌ ఇన్‌ బిల్ట్‌గా ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా అనేక సిఫార్సులను పొందవచ్చు. సులభంగా అనేక అంశాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ఇప్పటికే వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా ఇప్పటికే AI యాప్స్‌ను ఉపయోగిస్తున్నారని, అయితే ఈ యాప్‌లో వాయిస్‌ పరంగాను మరింత మెరుగైన మార్పులు చేసినట్లు మెటా తన బ్లాగ్‌ లో పేర్కొంది. ఫలితంగా యూజర్‌, యాప్‌ మధ్య సంభాషణ మరింత ఆకట్టుకొనేలా ఉంటుందని తెలిపింది.

ఈ యాప్‌లో ఫుల్‌ డూప్లెక్స్ స్పీచ్‌ టెక్నాలజీని ఉపయోగించారు. దీని ద్వారా మరింత సహజంగా, రియల్‌ టైం సంభాషణలకు అవకాశం ఉంటుందని మెటా చెబుతోంది. దీని ద్వారా ఇమేజ్‌ లను జనరేట్‌ చేయడం సహా ఎడిట్‌ చేయడం చాలా సులభమని.. వాయిస్‌ లేదా టెక్స్ట్‌ ద్వారా ఈ టాస్క్‌లను పూర్తి చేయవచ్చని చెప్పింది.

మెటా ఇప్పటికే తమ AI టూల్స్‌ను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్, మెసేంజర్‌ ఇంటిగ్రేట్ చేసింది. అయితే కొత్తగా లాంచ్‌ చేసిన AI యాప్‌ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లోనే అందుబాటులోకి వచ్చింది. భారత్‌ సహా ఇతర దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు. దీని పై త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇటీవలే ఎడిట్స్‌ యాప్‌ : ఇన్‌స్టాగ్రామ్‌ క్రియేటర్ల కోసం మెటా తాజాగా ఎడిట్స్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. దీని ద్వారా మొబైల్‌లోనే సులభంగా వీడియో ఎడిటింగ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్‌, iOS స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ ద్వారా హై క్వాలిటీ వీడియోను రికార్డు చేయవచ్చు మరియు ఎడిటింగ్‌ చేసుకోవచ్చు.

ఈ వీడియోలను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాతోపాటు ఇతర యాప్స్‌లోనూ షేర్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో గ్రీన్‌ స్క్రీన్‌, మ్యూజిక్‌ క్యాటలాగ్‌, కౌంట్‌డౌన్‌ వంటి అనేక ఫీచర్‌లు ఉన్నాయి. దీంతోపాటు నాయిస్‌ తగ్గించడంతోపాటు బ్యాగ్రౌండ్‌ను తొలగించేందుకు కూడా ప్రత్యేక టూల్స్‌ ఉన్నాయి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X