ఎన్నికల నేపథ్యంలో మెటా సంస్థ కీలక నిర్ణయం.. ఇక అలాంటి కంటెంట్‌పై నియంత్రణ!!
మెటా కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మెటా (Meta Latest Update) నిర్ణయం ప్రాధాన్యత సంతరించకుంది. ప్రస్తుతం రాజకీయాల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అత్యధిక శాతం మంది అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఈ ప్లాట్‌ఫాంలు ఉద్రిక్తలకు కూడా కారణం అవుతున్నాయి.
కొన్ని దేశాల్లో గతంలో జరిగిన ఎన్నికల్లో సోషల్ మీడియా అధిక ప్రభావం చూపింది. ఫలితంగా ఆయా సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌లో (Instagram and Threads) రాజకీయ కంటెంట్‌పై వినియోగదారులు నియంత్రణ ఉండేలా కీలక అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

మెటా తీసుకొచ్చిన అప్‌డేట్‌తో వినియోగదారులు తమ కంటెంట్‌పై మరింత నియంత్రణ పొందనున్నారు. రాజకీయాలకు సంబందించి యూజర్ల ప్రాధాన్యతలను గౌరవించడమే ఈ మార్పుల వెనుక ముఖ్య ఉద్దేశమని ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోస్సేరి వెల్లడించారు.
కొంత మంది యూజర్ల రాజకీయాలకు సంబంధించిన కంటెంట్ గురించి వెతుకుతారని, మరికొంతమని అందుకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతారని తెలిపారు. మెటా తీసుకొచ్చిన కొత్త అప్‌డేట్‌తో వారి అభిరుచులను గౌరవిస్తామని పేర్కొన్నారు. ఫీడ్‌ను ఫిల్టర్ చేయడం సహా అవసరమయ్యే వారికి ఎంగేజ్ చేస్తుందని తెలిపారు.

ప్రభుత్వం, ఎన్నికల సమాచారం లేదా ఇతర సమస్యలకు గురించి తెలుసుకోవాలని భావించే వారు తమ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. మరియు పబ్లిక్ అకౌంట్ల నుంచి కంటెంట్‌ను పొందవచ్చు. ఇప్పటికే ఫాలో అవుతున్న ఖాతాల ను కంటెంట్‌ను ఈ కొత్త అప్‌డేట్ ప్రభావితం చేయదని తెలిపారు.
వార్తలు, రాజకీయ వివాదాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను దూరంగా ఉంచే ఉద్దేశంతోనే మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ సోషల్ మీడియా వేదికల్లో రాజకీయాలకు సంబందించిన కంటెంట్ పరిమితం చేయడం మరియు వ్యతిరేక కంటెంట్‌పైన పరిమితులను విధించనుంది.
మెటా తీసుకొచ్చిన ఈ కొత్త విధానం కంటెంట్ క్రియేటర్లకు, వృత్తిపరంగా తమ ప్లాట్‌ఫాలను వినియోగించే వారికి కొన్ని పరిమితులు విధిస్తుంది. వారి పోస్ట్‌ల రిచ్‌బిలిటీ స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా రాజకీయాలకు సంబందించిన కంటెంట్ వారి సోషల్ మీడియా అకౌంట్లను ఎలా ప్రభావితం చేస్తుందో వారికి అర్థమయ్యేలా చేస్తుందని మెటా భావిస్తోంది.
* ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ కీలక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అర్ధరాత్రి సమయంలో ఎక్కువ సమయం ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో గడపకుండా ఈ ఫీచర్ నియంత్రించనుంది. నైట్‌టైం నడ్జెస్ పేరుతో ఈ ఫీచర్‌ను మెటా పరిచయం చేసింది. ప్రస్తుతం అత్యధిక శాతం మంది యూజర్ల రీల్స్ చూస్తూ ఇన్‌స్టాలోనే గడిపేస్తున్నారు. పగటి పూట సహా అర్ధరాత్రి వేళల్లోనూ సోషల్ మీడియాలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఈ ప్రవర్తన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఈ నైట్‌టైం నడ్జెస్ ఫీచర్ అర్ధరాత్రి వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో అదే పనిగా 10 నిమిషాల పాటు గడిపినప్పుడు.. ఓ అలెర్ట్‌ను ఇన్‌స్టా జారీ చేసింది. మీరు పరిమితికి మించి ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపారు, కాబట్టి యాప్‌ను క్లో్జ్ చేయమని హెచ్చరిస్తున్నట్లు ఓ అలెర్ట్‌ను ఈ ఫీచర్ జారీచేయనుంది. ఈ అలెర్ట్‌తో వారి నిద్ర సమయాన్ని గుర్తుచేసినట్లు ఉంటుందని, ఫలితంగా సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి నిద్రపోయే అవకాశం ఉంటుందని మెటా సంస్థ భావిస్తోంది.
* ఇన్‌స్టాగ్రామ్ ఫ్లిప్‌సైడ్ అనే కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ వినియోగదారులు.. కుటుంబ సభ్యులు సహా ఇతర సన్నిహిత వ్యక్తులకు మాత్రమే తమ సమాచారం, పోస్టులు షేర్ చేసే అవకాశం కల్పిస్తుందని, ఫిన్‌స్టాస్ సమస్యకు చెక్ పెడుతుందని తెలుస్తోంది.
ఈ కొత్త ఫీచర్‌పై ఇన్‌స్టా హెడ్ ఆడమ్ మోస్సేరీ స్పందించారు. ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాలో కచ్చితంగా ప్రవేశపెడతామని తాము చెప్పలేమని, ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్‌లో ఉందని, ప్రజల నుంచి వచ్చిన స్పందనకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. వినియోగదారులకు ప్రైవేట్ స్పేస్‌ను సృష్టించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇన్‌స్టాగ్రామ్ మరో ప్రతినిధి తెలిపారు.
ఈ ఫీచర్ సెకండరీ ప్రొఫైల్‌గా పనిచేస్తుందని తెలుస్తోంది. కస్టమ్ నేమ్, ఫోటో, బయోతో కూడిన మరో ప్రోఫైల్‌ను క్రియేట్ చేయవచ్చని తెలుస్తోంది. సన్నిహితులకు మాత్రమే చేరేలా కంటెంట్, వీడియో, రీల్స్‌ను పోస్టు చేయవచ్చని తెలుస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో ఇన్‌స్టా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications