Home
News

మెటా కీలక అప్‌డేట్‌.. ఇన్‌స్టా యూజర్లకు ఎంతో ఉపయోగం.. ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో తెలుసా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్‌ ప్రపంచంలో ఇదో సంచలనం. ప్రస్తుతం అనేక సంస్థలు ఈ టెక్నాలజీని తమ యాప్‌లు, తమ సర్వీసులు సహా ఇతర సేలల్లో AIను ఇంటిగ్రెట్‌ చేసేందుకు కృషిచేస్తున్నారు. టెగ్‌ దిగ్గజం మెటా కూడా తన ప్లాట్‌ఫాంలను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఇంటిగ్రేట్‌ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది.

మెటా ఇప్పటికే సొంత లాంగ్వేజ్‌ మోడల్‌ను కలిగి ఉంది. మరియు అనేక ఫీచర్లను కలిగి ఉంది. తాజాగా మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్‌ఫాంలు వాట్సా్‌ప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యాలను మెరుగుపరచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Meta planning to introduce AI features in instagram

మెటాకు చెందిన యాప్‌ ఇంజినీర్‌ తాజాగా ఇందుకు సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేశారు. దాని ఆధారంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ఏఐ ఫీచర్లతో ఇంటిగ్రేట్‌ చేసేందుకు సంస్థ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదివరకు ప్రకటించినట్లుగా AI అవతార్‌ ఫీచర్‌ కాదని తెలుస్తోంది. అయితే తాజా ఏఐ ఇంటిగ్రేషన్‌ ఏం చేయనుంది.

ఈ స్క్రీన్‌షాట్‌ ఆధారంగా త్వరలో రానున్న AI ఆధారిత ఫీచర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు టెస్ట్‌ రాసుకొనేందుకు సాయం చేస్తుంది. "Write with AI" పేరుతో ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. యూజర్ల తమ DM (డెరెక్ట్ మెసెజ్‌) లో ఆప్షన్‌లో ఏదైనా రాసినప్పుడు కాపీ, కట్‌ వంటి పాప్‌ అప్‌ విండోగా ఇది కూడా కనిపిస్తుంది.

Meta planning to introduce AI features in instagram

మెటా సొంత లాంగ్వేజ్‌ మోడల్‌ Liama 2 Large ఆధారంగా Write with AI పనిచేస్తుంది. ఈ ఫీచర్‌ యూజర్లు తమ ఇన్‌స్టా ఖాతాల్లో రాసుకొనేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి స్క్రీన్‌షాట్‌ ఆధారంగా DM ఆప్షన్‌లోనే ఈ ఫీచర్‌ కనిపిస్తుండగా.. భవిష్యత్‌తో స్టోరీస్‌, రీల్స్‌, పోస్టుల్లో కూడా రాసుకొనేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని తెలుస్తోంది.

అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం ఏ దశలో ఉంది, టెస్టింగ్ ఎంత వరకు వచ్చింది, ఎప్పటి నుంచి ఈ ఫీచర్‌ ఇన్‌స్టాలో అందుబాటులోకి వస్తుందనేది తెలియలేదు. ఇప్పటికే మెటా తన ప్లాట్‌ఫాంలో అనేక మార్పులకు సిద్ధం అవుతోంది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల జరగనున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది.

* రాజకీయాలకు సంబంధించిన కంటెంట్‌ను నియంత్రించే అవకాశం వినియోగదారులకు ఇవ్వనుంది. వారు తమకు అలాంటి సమాచారం కావాలన్నా, వద్దన్నా పూర్తి నియంత్రణ వారి చేతుల్లోనే ఉండనుంది. మెటా తీసుకొచ్చిన అప్‌డేట్‌తో వినియోగదారులు తమ కంటెంట్‌పై మరింత నియంత్రణ పొందనున్నారు. రాజకీయాలకు సంబందించి యూజర్ల ప్రాధాన్యతలను గౌరవించడమే ఈ మార్పుల వెనుక ముఖ్య ఉద్దేశమని ఇన్‌స్టాగ్రామ్‌ అధిపతి ఆడమ్‌ మోస్సేరి వెల్లడించారు.

కొంత మంది యూజర్ల రాజకీయాలకు సంబంధించిన కంటెంట్‌ గురించి వెతుకుతారని, మరికొంతమని అందుకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతారని తెలిపారు. మెటా తీసుకొచ్చిన కొత్త అప్‌డేట్‌తో వారి అభిరుచులను గౌరవిస్తామని పేర్కొన్నారు. ఫీడ్‌ను ఫిల్టర్‌ చేయడం సహా అవసరమయ్యే వారికి ఎంగేజ్‌ చేస్తుందని తెలిపారు.

ప్రభుత్వం, ఎన్నికల సమాచారం లేదా ఇతర సమస్యలకు గురించి తెలుసుకోవాలని భావించే వారు తమ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. మరియు పబ్లిక్‌ అకౌంట్ల నుంచి కంటెంట్‌ను పొందవచ్చు. ఇప్పటికే ఫాలో అవుతున్న ఖాతాల ను కంటెంట్‌ను ఈ కొత్త అప్‌డేట్‌ ప్రభావితం చేయదని తెలిపారు.

వార్తలు, రాజకీయ వివాదాలకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలను దూరంగా ఉంచే ఉద్దేశంతోనే మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ సోషల్‌ మీడియా వేదికల్లో రాజకీయాలకు సంబందించిన కంటెంట్‌ పరిమితం చేయడం మరియు వ్యతిరేక కంటెంట్‌పైన పరిమితులను విధించనుంది.

Best Mobiles in India

English summary
Meta set to launch Write with AI feature in instagram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X