భారత్ యూజర్లకు అందుబాటులోకి మెటా AI ... ఏ విధంగా వినియోగించుకోవచ్చు..!
మెటా ఎట్టకేలకు భారత్ లో AI చాట్‌బాట్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫలితంగా మెటా నేతృత్వంలోని సంస్థలు అయిన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసేంజర్ తోపాటు మెటా వెబ్ సైట్ ద్వారా విడుదల చేస్తోంది. రెండు నెలల క్రితమే ఈ AI చాట్‌బోట్ ను (Meta AI) మెటా ఆవిష్కరించింది. తొలి దశలో న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. బహుశా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత్ తో తొలిదశలో అందుబాటులోకి తీసుకురాలేదు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI ) అసిస్టెంట్‌టో ఏమేం చేయవచ్చు :
ఈ మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్ గూగుల్, మైక్రో సాఫ్ట్ రియల్ టైం సెర్చ్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది. ఫలితంగా గ్రూప్ చాట్ సహా విహార యాత్రలు సహా ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈ మెటా AI చాట్‌బాట్ ద్వారా ఈ-మెయిల్‌లు, కవితలు రాయడం, ఒక భాష నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేయడం వంటి పనులను చేయవచ్చు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసేంజర్‌లో :
మెటా AI చాట్ విండో ద్వారా ఫోటోలు, GIF లను రూపొందించవచ్చు. ఈ మెటా ఏఐ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసేంజర్ సెర్చ్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది. దీంతోపాటు ఫేస్ బుక్ యాప్‌లో పోస్ట్ లను స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా గుర్తించవచ్చు.
ఇతర యాప్‌ల అవసరం లేదు :
అయితే మెటా AI నుంచి సంస్థకు చెందిన యాప్ ల ద్వారా నేరుగా వినియోగించుకోవచ్చు. గూగుల్ జెమినీ గానీ లేదా ChatGPT ని గానీ ప్రత్యేకంగా యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెటా AI భారత్ లో ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేకపోయినా.. దశలవారీగా విడుదల కానుందని తెలుస్తోంది.
మెటా కనెక్ట్ 2023లో తొలిసారిగా ప్రకటన :
మెటా AI లార్జ్ లాంగ్వేజ్ మోడల్ Meta Liama 3 ఆధారంగా రూపొందించారు. ఈ మోడల్ ను మెటా కనెక్ట్ 2023 లో దీనిపై ప్రకటన చేశారు. ప్రస్తుతం భారత్ లో విడుదల అవుతోంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, మెసేంజర్ లో అందుబాటులో ఉంది.
వాట్సాప్‌లో ఎలా వినియోగించుకోవచ్చు..?
వాట్సాప్‌లో మెటా AI అందుబాటులోకి వచ్చాక.. స్క్రీన్ కింద వైపు కుడి భాగంలో ఏఐ చిహ్నాన్ని గుర్తించవచ్చు. వినియోగించాలని భావిస్తే.. దానిపై క్లిక్ చేయాలి. అనంతరం ప్రశ్నలు అడగడం, ఫోటోలను రూపొందించడం సహా ఇతర పనులకు ఉపయోగించవచ్చు.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications