Home
News

సంచలనం సృష్టించిన మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్.. 2024లో 10 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయ్..

Meta Ray-Ban smart glasses: ఇటీవల కాలంలో అన్ని వస్తువులు స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే స్మార్ట్ ఐ-గ్లాసెస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. అయితే ఇతర కంపెనీల స్మార్ట్ కళ్లద్దాలు ఏ స్థాయిలో అమ్ముడుపోయాయో తెలియదు కానీ మెటా కంపెనీ తయారు చేసినవి మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ ఏకంగా 10 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయని ఆయన ఉద్యోగులతో చెప్పారు.

"ది వెర్జ్" రిపోర్ట్ ప్రకారం, ఒక మీటింగ్‌లో జుకర్‌బర్గ్ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు, జుకర్‌బర్గ్ ఒక ప్రశ్న కూడా వేశారు. 2025లో ఈ అమ్మకాలు డబుల్ అవుతాయా? అంటే 20 లక్షలకు చేరుకుంటాయా? లేక ఏకంగా 50 లక్షల యూనిట్ల అమ్మకాలతో రికార్డు సృష్టిస్తాయా? అని ఆసక్తికరంగా మాట్లాడారు.

Meta s Ray-Ban Smart Glasses Hit Milestone  Over 1 Million Units Sold in 2023

* ఫీచర్లు అదిరిపోయాయి...

మెటా ఈ రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్‌ను 2023లో లాంచ్ చేసింది. అప్పటినుంచి కొత్త ఫీచర్లను కంటిన్యూగా యాడ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ గ్లాసెస్‌లో మల్టీమోడల్ ఏఐ టెక్నాలజీ ఉంది. ఇది చూసేది, వినేది, చదివేది.. అన్నీ ప్రాసెస్ చేస్తుంది. లైవ్ ఏఐ అసిస్టెన్స్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ కూడా ఉన్నాయి.

జుకర్‌బర్గ్ ఈ మార్కెట్‌ను తామే లీడ్ చేస్తున్నామని, పోటీ కూడా అంతగా లేదని అంటున్నారు. "మేమే ఈ కేటగిరీని కనిపెట్టాం. ఇంకా మా పోటీదారులు ఎవరూ పెద్దగా రాలేదు," అని ఆయన అన్నారు. అయితే 2025 చివరికి లేదా 2026 మొదట్లో పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు స్మార్ట్-గ్లాసెస్‌ను వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయనుంది.

* మెటా ఫ్యూచర్ ప్లాన్స్...

2025లో వేరబుల్ టెక్నాలజీని మరింత విస్తరించేందుకు మెటా రెడీ అవుతోంది. "హైపర్‌నోవా" కోడ్‌నేమ్‌తో హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD)తో సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను రిలీజ్ చేయబోతోంది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం, ఓక్లీతో కలిసి మరో స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా మెటా తయారు చేస్తోంది. ఈ కొత్త మోడల్ ఈ ఏడాదిలోనే లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.

* సైలెంట్ కానీ..

ఈ డెవలప్‌మెంట్స్‌పై మెటా అఫీషియల్‌గా ఏమీ చెప్పలేదు. కానీ స్మార్ట్ గ్లాసెస్‌పై వాళ్ల ఫోకస్ మాత్రం క్లియర్‌గా కనిపిస్తోంది. 2024లో మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని రే-బాన్ స్టోర్స్‌లో దుమ్మురేపాయి. ఏకంగా 60% స్టోర్స్‌లో టాప్-సెల్లింగ్ ప్రొడక్ట్‌గా నిలిచాయి. స్టైల్‌, ఫీచర్లు ఉంటే జనాలు ఎగబడికొంటారని ఇది ప్రూవ్ చేసింది.

* కొన్ని ఛాలెంజ్‌లు..

స్మార్ట్ గ్లాసెస్ ఎంత పాపులర్ అయినా, కొన్నిసార్లు ఏఐ ఫీచర్స్‌లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని యూజర్లు అంటున్నారు. లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ స్లోగా, బేసిక్ కాన్వర్జేషన్‌లకు బాగా పనిచేస్తుంది. కానీ ఫాస్ట్ స్పీచ్, స్లాంగ్, మిక్స్‌డ్ లాంగ్వేజెస్‌తో మాత్రం స్ట్రగుల్ అవుతోంది.

లైవ్ ఏఐ అసిస్టెంట్ కూడా కొన్నిసార్లు మరీ సింపుల్ ఆన్సర్స్ ఇస్తోందని, స్మార్ట్‌ఫోన్ వాడటం బెటర్ అనిపిస్తోందని కొందరు అంటున్నారు. మెటా మాత్రం ఈ ఛాలెంజ్‌లను సీరియస్‌గా తీసుకుంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇంప్రూవ్ చేసేందుకు కంటిన్యూగా పనిచేస్తోంది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో రిమైండర్స్, టైమర్స్, వాట్సాప్ వాయిస్ మెసేజెస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్, మెటా ఏఐ వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లను యాడ్ చేస్తోంది. ఫ్యూచర్ అప్‌డేట్స్‌లో లైవ్ ట్రాన్స్‌లేషన్, స్పాటిఫై కంట్రోల్స్ ఇంకా చాలా ఫీచర్లు రాబోతున్నాయి. మెటా, ఎస్సిలర్ లక్సోటికా పార్ట్‌నర్‌షిప్ 2030 వరకు కంటిన్యూ కానుంది.

అంటే రాబోయే రోజుల్లో చాలా తరాల స్మార్ట్ ఐవేర్ ప్రొడక్టులను మనం చూడబోతున్నామన్నాం. వేరబుల్ టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలని, యూజర్ల అంచనాలను అందుకోవాలని మెటా గట్టిగా ఫిక్స్ అయింది. ఫీచర్లను మెరుగుపరుస్తూ, ఎక్కువ మందికి చేరువయ్యేలా ప్లాన్ చేస్తూ స్మార్ట్ ఐవేర్ మార్కెట్‌లో లీడర్‌గా నిలవాలని చూస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Meta's Ray-Ban smart glasses sold 1 million units in 2024, featuring AI-powered live translation. Future models with HUD and Oakley collaboration highlight Meta's commitment to smart eyewear despite AI limitations.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X