108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్ ధరపై 45 శాతం డిస్కౌంట్.. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ (Flipkart Republic day sale) జరుగుతోంది. ఈ సేల్ జనవరి 13న ప్రారంభం అయింది. ఈనెల 19 వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర గ్యాడ్జెట్ల పై ఆకర్షణీయ తగ్గింపును అందిస్తోంది. ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా Mi స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. Mi 10T Pro స్మార్ట్‌ఫోన్‌పై (Mi 10T Pro) 45 శాతం డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. మరియు 108MP ప్రధాన కెమెరా సహా ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది.

ఎంఐ 10T ప్రో స్మార్ట్‌ఫోన్ పై 45 శాతం డిస్కౌంట్ : ఎంఐ 10T ప్రో స్మార్ట్‌ఫోన్ సాధారణ ధర రూ.47999గా ఉంది. ఈ ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.25,999కే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు 45 శాతం డిస్కౌంట్ లభించనుంది.
అలాగే ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు ధరను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతోపాటు నెలవారీగా రూ.915 EMI చెల్లింపు ఆప్షన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

ఎంఐ 10T ప్రో స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. మరియు HDR10+ సపోర్టు, 650 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఆప్షన్‌తో రానుంది. అలాగే 85.2 స్క్రీన్ టూ బాడీ రేషియో, 395 ppi డెన్సిటీ, డిస్‌ప్లే కార్మింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంటుంది.
ఈ Mi స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం SM8250 స్నాప్‌డ్రాగన్ 865 5G ప్రోసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 MIUI 12.5కి OSను అప్‌గ్రేట్ చేయవచ్చు. 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది.
ఇందులో 108MP ప్రధాన కెమెరా, 13MP సెకండరీ కెమెరా, 5MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఎల్‌ఈడీ ప్లాష్, HDR, పనోరమా ఫీచర్లు ఉంటాయి. దీంతోపాటు ఈ ఫోన్ ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాను కలిగి ఉంది.
ఎంఐ 10T ప్రో బ్యాటరీ స్పెసిఫికేషన్ల వివరాలు : ఈ స్మార్ట్‌ఫోన్ 33W వైర్డ్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు వైఫై 802.1, బ్లూటూత్ 5.1 సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








