కొత్త మైలురాయిని దాటిన షియోమి!

|

చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో షియోమి మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన Mi బ్యాండ్ 4 ఒక మిలియన్ యూనిట్లను కేవలం ఎనిమిది రోజుల్లో విక్రయించినట్లు చెప్పారు. షియోమికి ఇది ఒక కొత్త మైలురాయి. ఎందుకంటే చైనీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అమ్మకాల విషయంలో అది గంటకు 5,000 యూనిట్లు అమ్ముడైందని వెల్లడించింది. ఇది 1 మిలియన్ మార్కును చేరుకున్న వేగవంతమైన Mi బ్యాండ్ గా పేర్కొనబడింది.

కొత్త మైలురాయిని దాటిన షియోమి!

 

ఈ డివైస్ 0.95-అంగుళాల కలర్ AMOLED డిస్ప్లే, NFC సపోర్ట్, సిక్స్-యాక్సిస్ యాక్సిలెరోమీటర్ సెన్సార్ మరియు వాయిస్ కమాండ్ల కోసం మైక్రోఫోన్‌తో నిర్మించిన అనేక కొత్త లక్షణాలతో వస్తుంది. ఈ డివైస్ గత సంవత్సరం రిలీజ్ అయిన Mi బ్యాండ్ 3 యొక్క అప్డేట్ వర్షన్ గా రిలీజ్ అయింది.Mi 3బ్యాండ్ 0.78-అంగుళాల మోనోక్రోమ్ OLED డిస్ప్లేతో 80x128 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది.

ధరలు:

Mi బ్యాండ్ 4 డివైస్ ఎన్‌ఎఫ్‌సి లేని వేరియంట్‌కు 169 యువాన్ (సుమారు Rs.1,700) ధర ఉండగా దానితో ఉన్న మరొక దాని ధర 229 యువాన్ (సుమారు ₹ 2,300)లు.భారతదేశంలో Mi బ్యాండ్ 4 అమ్మకాలు ఎప్పుడు ప్రారంభిస్తుందో షియోమి ఇంకా ప్రకటించలేదు.

Mi బ్యాండ్ 4 లో కొత్తగా ఏమి ఉంది:

డిస్ప్లే:

Mi బ్యాండ్ 4 0.95-అంగుళాల AMOLED డిస్ప్లే తో వస్తుంది.దీని యొక్క ప్యానెల్ మోనోక్రోమ్ కాదు ఇది పూర్తిగా కలర్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది.ఇది ఇప్పుడు మీ శారీరక శ్రమ గురించి సమాచారాన్ని అందివ్వడమే కాకుండా కొత్త టెక్స్ట్ మెసేజ్ లు మరియు వాయిస్ కాల్‌లపై నోటిఫికేషన్‌లను నేరుగా కనెక్ట్ చేసిన ఫోన్ నుండి అందించగలదు.డిస్ప్లే అనేక ఇతర ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఫోన్‌ను కనుగొనడానికి, మ్యూజిక్ ట్రాక్‌ను మార్చడానికి, మీకు ప్రత్యక్ష వాతావరణం మరియు స్టాక్ అప్డేట్ లను అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు 77 రకాల కలర్ వాచ్ ఫేస్‌లతో వస్తుంది. ఇది QR కోడ్‌లను కూడా ప్రదర్శించగలదు కాబట్టి షియోమి పేమెంట్ మోడ్‌ను స్మార్ట్ బ్యాండ్‌కు అనుసంధానించింది.

మైక్రోఫోన్:
 

మైక్రోఫోన్:

Mi బ్యాండ్ 4 వాయిస్ అసిస్టెన్స్ కోసం మైక్రోఫోన్‌తో వస్తుంది. టచ్ మరియు వాయిస్ ద్వారా స్మార్ట్ బ్యాండ్‌తో ఇంటరాక్ట్ అయ్యే మార్గాలను మీరు ఇప్పుడు కలిగి ఉండాలని దీని అర్థం. అనుకూలమైన మరియు కనెక్ట్ చేసిన పరికరాలకు వాయిస్ ఆదేశాలను పంపడానికి వాయిస్ నియంత్రణలు మిమ్మల్ని అనుమతిస్తాయి.

సిక్స్-యాక్సిస్ యాక్సిలెరోమీటర్:

సైక్లింగ్, వ్యాయామం,రన్నింగ్,స్విమ్మింగ్ మరియు వాకింగ్ వంటి శారీరక కార్యకలాపాలను పర్యవేక్షించడంలో సహాయపడటానికి Mi బ్యాండ్ 4 సిక్స్-యాక్సిస్ యాక్సిలెరోమీటర్‌తో వస్తుంది. ఇది వివిధ రకాల స్విమ్మింగ్ స్ట్రోక్‌లను కూడా గుర్తించగలదు మరియు ఈతగాళ్లకు ఉపయోగపడే వోల్ఫ్ స్కోర్‌లను అందిస్తుంది.

NFC

Mi బ్యాండ్ 4 ఎన్‌ఎఫ్‌సి కనెక్టివిటీతో వస్తుంది కాబట్టి ఇది ఇతర డివైస్లతో చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది.

బ్యాటరీ:

షియోమి Mi బ్యాండ్ 4 ఒక్క ఛార్జీపై కనీసం 20 రోజుల బ్యాటరీ లైఫ్ నీ అందిస్తుందని పేర్కొంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
mi band 4 sold more than a million units in 8 days

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more