షియోమి వెండింగ్ మిషన్లు వచ్చేశాయి, అచ్చం ATMల మాదిరిగానే..

మనం ఇప్పటివరకు మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, షాపింగ్స్‌ మాల్స్‌లో కూల్‌ డ్రింక్స్‌ విక్రయించే వెండింగ్‌ మెషిన్లను మాత్రమే చూసి ఉంటాం. ఇకపై మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ యాక్సెసరీలను విక్రయించే...

|

మనం ఇప్పటివరకు మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, షాపింగ్స్‌ మాల్స్‌లో కూల్‌ డ్రింక్స్‌ విక్రయించే వెండింగ్‌ మెషిన్లను మాత్రమే చూసి ఉంటాం. ఇకపై మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ యాక్సెసరీలను విక్రయించే వెండింగ్‌ మెషిన్లను కూడా మనం చూడబోతున్నాం. ఈ తరహా మెషిన్లకు దిగ్గజ చైనా మొబైల్‌ ఫోన్ల కంపెనీ షియోమీ శ్రీకారం చుట్టింది. కాగా ఇండియన్ మొబైల్ మార్కెట్లలో చైనీస్ టెక్ దిగ్గజం షియోమీ ట్రెండ్ నడుస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడూ అదిరిపోయే ఫీచర్లతో Xiaomi MI స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేస్తోంది.

షియోమి వెండింగ్ మిషన్లు వచ్చేశాయి, అచ్చం ATMల మాదిరిగానే..

షియోమీ విడుదల చేసిన ఎంఐ, రెడ్ మి నోట్ స్మార్ట్ ఫోన్లకు ఇండియాలో ఎంతో క్రేజ్ ఉంది. దేశంలో మొబైల్ మార్కెట్ ను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోన్న షియోమీ ఇప్పుడు వెండింగ్ మిషన్ల ద్వారా ఫోన్లు విక్రయించాలనే వ్యూహానికి తెరలేపింది. ఇకపై యూజర్లు స్మార్ట్ ఫోన్లు కొనాలంటే మొబైల్ స్టోర్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఆన్ లైన్ స్టోర్లలో కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం అంత కన్నా లేదు. నేరుగా వెండింగ్ మిషన్ ఉండే చోటు నుంచే కొనుగోలు చేయవచ్చు.

Mi Express Kiosks

Mi Express Kiosks

స్మార్ట్ ఫోన్ల సేల్స్ కోసం Mi Express Kiosks లను షియోమీ ఇండియాలో ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేసేందుకు Xiaomi ప్లాన్ చేస్తోంది. ఈ వెండింగ్ మిషన్లలో నుంచి స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. యాక్ససిరీస్ కూడా కొనుగోలు చేయొచ్చు. ఎంఐ ఎక్స్ ప్రెస్ కియాస్క్ దగ్గరే నేరుగా తమకు నచ్చిన స్మార్ట్ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు.

బెంగళూరులో ఫస్ట్

బెంగళూరులో ఫస్ట్

చైనా దిగ్గజం షియోమీ గ్లోబల్ విపి మను కుమార్ జైన్ బెంగళూరులోని మన్యతా టెక్ పార్క్ దగ్గర తొలి Xiaomi Kiosk ను ఆవిష్కరించారు. చూడటానికి అచ్చం ATM మిషన్లలానే ఈ Vending Machines ఉంటాయి. ఈ కియాస్క్ లో అన్ని రకాల పేమెంట్స్ చేసుకునేలా డిజైన్ చేసినట్టు ఆయన ట్విట్టర్ లో తెలిపారు.

  టచ్ స్క్రీన్ ద్వారా

టచ్ స్క్రీన్ ద్వారా

క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, క్యాష్, యూపీఐ పేమెంట్స్ ద్వారా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయొచ్చు. వెండింగ్ మిషన్లలో టచ్ స్క్రీన్ ద్వారా నచ్చిన స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకోవడం.. పేమెంట్ చేయడం.. అంతే.. క్షణాల్లో మీకు నచ్చిన మోడల్ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు.

భవిష్యత్తులో అన్ని మెట్రో నగరాల్లో

భవిష్యత్తులో అన్ని మెట్రో నగరాల్లో

ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ వెండింగ్ మిషన్లను ఇండియాలోని మెట్రో సిటీల్లో ప్రవేశపెట్టనున్నారు. భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో ఈ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. పబ్లిక్ ఏరియాల్లో అలాగే ఎయిర్ పోర్టులు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, టెక్ పార్కులు దగ్గర ఎంఐ ఎక్స్ ప్రెస్ కియాస్క్ లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మెట్రో సిటీల్లో ఎక్కడ షియోమీ కియాస్క్ మిషన్లు ఉన్నాయో.. Mi.com వెబ్ సైట్ ద్వారా యూజర్లు చెక్ చేసుకోవచ్చు.

200 స్మార్ట్‌ఫోన్లు నిల్వ చేసుకునే సామర్థ్యంతో..

200 స్మార్ట్‌ఫోన్లు నిల్వ చేసుకునే సామర్థ్యంతో..

200 స్మార్ట్‌ఫోన్లు నిల్వ చేసుకునే సామర్థ్యంతో ఈ వెండింగ్‌ మెషిన్లను రూపొందించనున్నట్లు షియోమీ ఇండియా ఓ వార్తా సంస్థకు వెల్లడించింది. ఈ కియోస్క్‌ పరిశోధనా, అభివృద్ధి భారత్‌లోనే జరిగిందని కంపెనీ చెబుతోంది. కియోస్క్‌లను షియోమీయే నిర్వహిస్తుంది. దేశీయంగా 10,000 రిటైల్‌ స్టోర్లను కలిగి ఉండాలన్నది షియోమి లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి తన వ్యాపారంలో ఆఫ్‌లైన్‌ వాటా 50 శాతానికి పెంచుకోవాలనుకుంటోంది.

దేశవ్యాప్తంగా 6000 రిటైల్‌ అవుట్‌లెట్లను

దేశవ్యాప్తంగా 6000 రిటైల్‌ అవుట్‌లెట్లను

2014లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన టెక్‌ దిగ్గజం షియోమీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6000 రిటైల్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా భారత మార్కెట్లో స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలను ప్రారంభించిన షియోమీ క్రమంగా ఆఫ్‌లైన్‌ స్టోర్లకూ విస్తరించింది.

అమ్మకాలను పెంచుకునే వ్యూహంతో

అమ్మకాలను పెంచుకునే వ్యూహంతో

ఆఫ్‌లైన్‌ ద్వారా అమ్మకాలను పెంచుకునే వ్యూహంతో ఉన్న షియోమీ ఇప్పుడు మొబైల్‌ వెండింగ్‌ మెషిన్లను తీసుకువస్తోంది. వీటి నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడైనా వీటిని ఏర్పాటు చేయవచ్చు. వీటి ద్వారా అమ్మకాలు మరింతగా పెంచుకునే అవకాశం లభిస్తుందని కంపెనీ భావిస్తోంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi Express Kiosks Announced, Vending Machines That Sell Smartphones and Accessories

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X