Mi ప్యాడ్ 5-సిరీస్ టాబ్లెట్‌ల లాంచ్ డేట్, డిజైన్, ఫీచర్స్ ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి...

|

షియోమి Mi ప్యాడ్ 5-సిరీస్ ఈ నెలలో లాంచ్ కానుంది. ఈ చైనీస్ OEM కొత్తగా Mi ప్యాడ్ సిరీస్- వనిల్లా Mi ప్యాడ్ 5 మరియు పెద్ద Mi ప్యాడ్ 5 ప్రో వంటి రెండు వేరియంట్లను ప్రవేశపెట్టవచ్చని రూమర్ సూచిస్తుంది. కొత్త నివేదిక ప్రకారం రాబోయే Mi ప్యాడ్ 5 ను చైనా 3C నియంత్రణ ద్వారా ధృవీకరించారు. ఇది కొత్త టాబ్లెట్ లాంచ్ మూలలోనే ఉండవచ్చని సూచిస్తుంది.

Mi ప్యాడ్ 5-సిరీస్

గిజ్మోచినా గుర్తించిన జాబితా స్లేట్లలో Mi ప్యాడ్ 5-సిరీస్ యొక్క వివరాలను వెల్లడిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే Mi ప్యాడ్ 5 డ్యూయల్ 4,260mAh బ్యాటరీతో లభిస్తుంది. అంటే ఇది 8,520mAh యొక్క సంచిత బ్యాకప్‌ను అందిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం మినహా కొత్త Mi ప్యాడ్ టాబ్లెట్ గురించి ఎటువంటి వివరాలను జాబితాలో ఇవ్వలేదు. ఏదేమైనా గతంలో లభించిన అనేక పుకార్లలో రాబోయే Mi ప్యాడ్ 5 సిరీస్ యొక్క డిజైన్, ఇంటర్నల్స్ స్టోరేజ్ మరియు ఇతర కొన్ని ఫీచర్లను పంచుకున్నాయి.

Mi ప్యాడ్ 5, Mi ప్యాడ్ 5 ప్రో ధర, విడుదల తేదీ

Mi ప్యాడ్ 5, Mi ప్యాడ్ 5 ప్రో ధర, విడుదల తేదీ

కొన్ని నివేదికల ప్రకారం రాబోయే Mi ప్యాడ్ 5 సిరీస్ ఈ నెలాఖరులో విడుదల అయ్యే అవకాశం అధికంగా ఉంది. Mi ప్యాడ్ 5 యొక్క వనిల్లా వేరియంట్ RMB 3,000 (సుమారు రూ.34,200) ధరను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రో వేరియంట్ యొక్క ధర గురించి ఎటువంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Mi ప్యాడ్ 5-సిరీస్ డిజైన్

Mi ప్యాడ్ 5-సిరీస్ డిజైన్

Mi ప్యాడ్ 5-సిరీస్ యొక్క ఇటీవలి రెండర్‌లు డివైస్ యొక్క డిజైన్ గురించి వెల్లడించాయి. దీని వెనుక భాగంలో Mi 11 లో ఉన్నదానికి సమానమైన ప్యానెల్ యొక్క ఎగువ ఎడమ వైపున చదరపు ఆకారంలో కెమెరా మాడ్యూల్ ను చూడవచ్చు. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా క్రింద భారీ షియోమి బ్రాండింగ్ చిహ్నాన్ని నిలువుగా చెక్కబడి ఉంటుంది. ఇది చూడడానికి ఇంటర్ఫేస్ ఆపిల్ ఐప్యాడ్ మాదిరిగానే కనిపిస్తుంది. స్క్రీన్ పైన సెల్ఫీ కెమెరా చుట్టూ మందపాటి బెజల్స్ నడుస్తున్నట్లు కనిపిస్తాయి.

Mi ప్యాడ్ 5-సిరీస్ స్పెసిఫికేషన్స్

Mi ప్యాడ్ 5-సిరీస్ స్పెసిఫికేషన్స్

Mi ప్యాడ్ 5-సిరీస్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఇవి స్నాప్‌డ్రాగన్ 870 మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో పనిచేస్తుందని తెలిపారు. స్టాండర్డ్ Mi ప్యాడ్ 5 టాబ్లెట్ 120HZ రిఫ్రెష్ రేట్‌తో 10.95-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే ప్రో మోడల్ 144HZ ప్యానల్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ టాబ్లెట్‌లు ఇన్-సెల్ యాక్టివ్ పెన్ టెక్నాలజీతో రవాణా అవుతాయని కొన్ని నిఘా వర్గాలు చెబుతున్నారు. నివేదికల ప్రకారం షియోమి ఈ కొత్త పరికరాల కోసం నిర్దిష్ట MIUI టాబ్లెట్ వెర్షన్‌ను అభివృద్ధి చేసింది. ఇంటర్ఫేస్ హ్యాండ్‌హెల్డ్ PC మోడ్‌కు మద్దతునిస్తుందని మరియు క్లాసిక్ స్టార్ట్ మెనూ, కంట్రోల్ సెంటర్ వంటి ఫీచర్లను అందిస్తుందని చెబుతున్నారు. Mi ప్యాడ్ 5 20 మెగాపిక్సెల్ + 13-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తోందని పుకారు ఉంది. ఈ టాబ్లెట్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉండనున్నది. అయితే Mi ప్యాడ్ 5 ప్రోకు స్టైలస్ సపోర్ట్ లభిస్తుందని చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Mi Pad 5, Mi Pad 5 Pro Leaks on online: Launch Date, Price, Specs, Design and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X