Home
News

షియోమి సర్‌ప్రైజింగ్ ఆఫర్, ఆ రెండింటికి సవాల్

చైనా మొబైల్స్ మేకర్ షియోమీ భార‌త్‌లో ఎంఐ పే సేవ‌ల‌ను ప్రారంభించింది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లోనే షియోమీ ఈ సేవ‌ల‌పై ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే భార‌త్‌లోని స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు ఎంఐ

చైనా మొబైల్స్ మేకర్ షియోమీ భార‌త్‌లో ఎంఐ పే సేవ‌ల‌ను ప్రారంభించింది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లోనే షియోమీ ఈ సేవ‌ల‌పై ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే భార‌త్‌లోని స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు ఎంఐ పే సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇక‌ షియోమీ ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగ‌స్వామ్య‌మై ఆ సేవ‌ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్న‌ది.

షియోమి సర్‌ప్రైజింగ్ ఆఫర్, ఆ రెండింటికి సవాల్

ఈ క్ర‌మంలో యూజ‌ర్లు ఎంఐ పే యాప్‌ను ఉప‌యోగించి ఆన్‌లైన్‌లో యూపీఐ ద్వారా న‌గ‌దును సుల‌భంగా ఇత‌రుల‌కు పంప‌వ‌చ్చు. ఇత‌రుల నుంచి న‌గ‌దును స్వీక‌రించ‌వ‌చ్చు. అలాగే బిల్ పేమెంట్స్, రీచార్జిలు కూడా చేసుకోవ‌చ్చు.

భారీ సవాల్

భారీ సవాల్

గూగుల్‌ పే, పేటీఎం తరహాలో తన పేమెంట్‌ యాప్‌ లకు ఇది భారీ సవాల్ విసరనుంది. డేటా లీక్‌ పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని అత్యధిక భద్రమైన సర్వీసులను అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇండియాలో మాత్రమే స్టోర్

ఇండియాలో మాత్రమే స్టోర్

యూజర్ల డేటాను ఇండియాలో మాత్రమే స్టోర్ చేస్తామని షియోమీ ప్రకటించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) క్లియరెన్స్‌ అనంతరం 'ఎంఐ పే' యాప్‌ను అధికారికంగా తీసుకొచ్చింది.

120 బిల్లర్స్‌తో ఒప్పందం

120 బిల్లర్స్‌తో ఒప్పందం

ఎంఐ పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం మాత్రమే కాదు... బిల్లులు, రీఛార్జుల చెల్లింపులు చేయొచ్చు. ఇందుకోసం 120 బిల్లర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ క్యూఆర్ కోడ్‌తో సహా ఇతర క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయొచ్చు.

యూజర్లకు ఆఫర్లు

యూజర్లకు ఆఫర్లు

ఎంఐ పే యాప్ యూజర్లకు మరో బంపర్‌ఆఫర్‌ కూడా ప్రకటించింది. వినియోగదారులు రెడ్‌మీ నోట్ 7, 32 అంగుళాల ఎంఐటీవీ 4ఏ ప్రో గెలుచుకునే అవకాశముందని షియోమీ ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Mi Pay launched in India to challenge Paytm; Xiaomi offers free 100 Redmi Note 7, 50 Mi TVs to Mi Pay users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X