20గంటల బ్యాటరీ లైఫ్ తో Mi సూపర్‌బాస్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు
ఇండియాలో గత కొన్ని సంవత్సరాలలో షియోమి సంస్థ మొబైల్ రంగంలో బాగా ప్రాచుర్యం పొందింది. మొబైల్ రంగంలోనే కాకుండా షియోమి టీవీ మరియు LED లైట్,ట్రిమ్మర్,హెడ్ఫోన్ వంటి ఉత్పత్తులను కూడా విడుదల చేసింది. ఇప్పుడు షియోమి తన ఐదవ Mi వార్షికోత్సవ అమ్మకాల వేడుకల్లో భాగంగా చైనా కంపెనీ Mi సూపర్‌బాస్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను విక్రయించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ అమ్మకం జూలై 15 అర్ధరాత్రి అమెజాన్ ఇండియాలో ప్రైమ్ డే సేల్స్ సందర్భంగా నిర్వహించనుంది. అంతేకాకుండా Mi సూపర్‌బాస్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను Mi.com నుండి కూడా కొనుగోలు చేయడానికి వీలు ఉంది.షియోమి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో Mi సూపర్ బాస్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ల గురించి కొన్ని స్పెసిఫికేషన్లను ధృవీకరించింది. హెడ్‌ఫోన్‌లు ఇయర్‌కప్స్‌లో 40 mm డ్రైవర్లను కలిగి ఉంటాయి. మరియు ఇవి 20 గంటల బ్యాటరీ లైఫ్ ని కలిగి ఉంటాయి.

స్పెసిఫికేషన్స్:
Mi సూపర్‌బాస్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ల ఉత్పత్తి గురించి మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించలేదు.కానీ ఇది హెడ్‌ఫోన్‌ల ప్రేమికుల కోసం తయారు చేయబడిందని కంపెనీ తెలిపింది. ఈ హెడ్‌ఫోన్‌లు సౌండ్ సిగ్నేచర్ మరియు తక్కువ సౌండ్ స్పెక్ట్రంకు అనుకూలంగా ఉంటుందని మేము ఖచ్చితంగా చెప్పగలం అని కంపెనీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఆటలను ఆడుతున్నప్పుడు, సంగీతం వినేటప్పుడు, పని చేసేటప్పుడు లేదా సినిమాలు చూసేటప్పుడు "లోతైన మరియు ప్రభావవంతమైన" హెడ్‌ఫోన్‌ల బాస్ అవుట్‌పుట్ కోరుకునే వినియోగదారులను షియోమి లక్ష్యంగా పెట్టుకుంటుంది.

షియోమి యొక్క ఇతర ఉత్పత్తులు:
షియోమి సంస్థ యొక్క ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో షియోమి యొక్క ఇతర ఉత్పత్తులు రెడ్‌మి K20, రెడ్‌మి 7A, Mi ట్రక్ బిల్డర్ (Mi క్రౌడ్‌ఫండింగ్‌లో), Mi బార్డ్ ట్రిమ్మర్, Mi రీఛార్జబుల్ LED లాంప్, Mi బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్ ఫోన్స్ బేసిక్, Mi ఫాస్ట్ ఛార్జర్ , మరియు Mi వాటర్ TDS టెస్టర్ వంటివి ప్రస్తుతం అమ్మకానికి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








