Xiaomi నుంచి కొత్తగా మరో Mi స్మార్ట్ టీవీ లాంచ్!! తక్కువ ధరలో గొప్ప ఫీచర్స్..

|

Mi టివి 4A 40 హారిజోన్ ఎడిషన్ స్మార్ట్ టీవీని ఇండియాలో నేడు లాంచ్ చేసారు. షియోమి యొక్క ఈ కొత్త స్మార్ట్ టివి 2019 లో లాంచ్ అయిన Mi టివి 4A 40 కన్నా అప్‌గ్రేడ్‌ వెర్షన్ గా వస్తుంది. ఈ టీవీ లీనమయ్యే వీక్షణ అనుభవాన్ని అందించడానికి "బెజెల్-లెస్" డిజైన్ ను 93.7 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో కలిగి వస్తుంది. ఏదేమైనా కొత్త డిజైన్‌తో పాటు స్మార్ట్ టీవీ Mi టీవీ 4A 40 మాదిరిగానే ఉంటుంది. ఇది సంస్థ యొక్క ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్‌తో ప్రీలోడ్ చేయబడి ఉంటుంది. ఇది యూనివర్సల్ సెర్చ్, కిడ్స్ మోడ్ మరియు సెలబ్రిటీ వాచ్‌లిస్ట్‌ వంటి ఫీచర్లను అందిస్తుంది.

Mi టివి 4A 40 హారిజోన్ ఎడిషన్ ధరల వివరాలు

Mi టివి 4A 40 హారిజోన్ ఎడిషన్ ధరల వివరాలు

భారతదేశంలో Mi టివి 4A 40 హారిజోన్ ఎడిషన్ రూ.23,999 ధర వద్ద లాంచ్ అయింది. ఈ టీవీ ఫ్లిప్‌కార్ట్, Mi.కామ్, Mi స్టూడియో మరియు Mi రిటైల్ భాగస్వామి దుకాణాల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. రేపటినుంచి అంటే జూన్ 2 బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని యొక్క అమ్మకాలు ప్రారంభమవుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా లభ్యత వంటి సంబంధిత విషయాలు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Mi టివి 4A 40 హారిజోన్ ఎడిషన్ లాంచ్ ఆఫర్స్

Mi టివి 4A 40 హారిజోన్ ఎడిషన్ లాంచ్ ఆఫర్స్

Mi టివి 4A 40 హారిజోన్ ఎడిషన్‌ టీవీ మొదటి కొనుగోలు మీద కొన్ని లాంచ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ & డెబిట్ కార్డ్ లను కలిగి ఉన్న వినియోగదారులు వారి ఇఎంఐ లావాదేవీలపై రూ.1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీనితో పాటుగా ఫ్లిప్‌కార్ట్ లో తన పాత స్మార్ట్ టీవీకి బదులుగా కొత్త Mi టీవీని కొనుగోలు చేసే వినియోగదారులకు 11,000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. అసలైన Mi టీవీ 4A 40 టీవీ 2019 సెప్టెంబర్‌లో రూ.17,999 ధర వద్ద విడుదలైంది. అయితే ప్రస్తుతం ఇది రూ.22,999 ధర వద్ద లభిస్తున్నది.

Mi టివి 4A 40 హారిజోన్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

Mi టివి 4A 40 హారిజోన్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

Mi టివి 4A 40 హారిజన్ ఎడిషన్ ఆండ్రాయిడ్ టివి 9.0 లో ప్యాచ్‌వాల్ యొక్క "మెరుగైన వెర్షన్" తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ టీవీలో 17-డిగ్రీల వీక్షణ కోణాలతో 40-అంగుళాల ఫుల్-హెచ్‌డి డిస్ప్లేను 1,920x1,080 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంది. షియోమి యొక్క యాజమాన్య Vivid పిక్చర్ ఇంజిన్ (VPE) టెక్నాలజీతో పాటు ఇది 10W యొక్క రెండు స్పీకర్లతో వస్తుంది. మొత్తంగా ఇది 20W స్టీరియో సౌండ్ అవుట్ ఫుట్ ను కలిగి ఉంటుంది. దీని యొక్క స్పీకర్లలో DTS-HD మద్దతు కూడా ఉంది.

CPU

Mi టివి 4A 40 హారిజన్ ఎడిషన్ టీవీ హుడ్ కింద క్వాడ్-కోర్ అమ్లాజిక్ కార్టెక్స్- A53 CPU తో ఉంది. వీటితో పాటు మాలి -450 జిపియు మరియు 1GB DDR ర్యామ్‌తో పాటు 8GB EMMC స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ వి 4.2, రెండు యుఎస్‌బి 2.0 పోర్ట్‌లు, మూడు హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌లు (ఎఆర్‌సి మద్దతుతో సహా), ఈథర్నెట్ పోర్ట్, ఎస్ / పిడిఎఫ్ మరియు అనేక కనెక్టివిటీ ఎంపికలతో పాటుగా 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

రిమోట్ కంట్రోల్‌

Mi టీవీ 4A 40 హారిజోన్ ఎడిషన్ రిమోట్ కంట్రోల్‌తో జతచేయబడి వస్తుంది. ఇది వివిధ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను యాక్సిస్ చేయడానికి ప్రత్యేకమైన కీలను కలిగి ఉంది. స్మార్ట్ టీవీలో ప్రీలోడ్ చేయబడిన Mi క్విక్ వేక్ కూడా ఉంది. ఇది టీవీని ఐదు సెకన్లలోపు ఆన్ చేస్తుంది మరియు మీ Mi స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించటానికి మిమ్మల్ని అనుమతించే Mi హోమ్ యాప్ తో వస్తుంది. అలాగే ఇది 892.2x512.8mm కొలతలతో లభిస్తుంది. టీవీ యొక్క బేస్ వెడల్పు 210.4mm లను కలిగి ఉండి 5.48 కిలోగ్రాముల బరువుతో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Mi TV 4A 40 Horizon Edition New Smart TV Released With 20W Speakers in India: Price, Specs, Launch Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X