భర్త క్యాంపెయిన్ కోసం భార్య ట్విట్టర్‌లో...

Posted By: Super

భర్త క్యాంపెయిన్ కోసం భార్య ట్విట్టర్‌లో...

 

అమెరికా మొదటి మహిళ మిచెల్లీ ఒబామా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఎకౌంట్‌ని ఓపెన్ చేసిన కొన్ని గంటల లోపే ఆమెను 100,000 ఫాలోవర్స్ ఫాలో అవ్వడం జరిగింది. అమెరికాలో ఇలా మొదటి మహిళ ట్విట్టర్‌లో చేరడం విశేషం. అంతేకాకుండా మిచెల్లీ ఒబామా(@michelleobama) ప్రత్యేకంగా ట్విట్టర్‌లో ఎకౌంట్‌ని ఓపెన్ చేయడానికి కారణం రాబోయే కాలంలో జరగనున్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్ క్యాంపెయిన్‌కి మిచెల్లీ తనదైన శైలిలో ట్విట్టర్‌ని వాడనున్నారు.

ఇంతకీ మిచెల్లీ ఒబామా విడుదల చేసిన ట్విట్టర్ ఎకౌంట్ పేరు ఏంటంటే @michelleobama. ట్విట్టర్‌లో ఎకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మొదటి ట్వీట్‌గా అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం మొదటి మహిళ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో చేరడం జరిగిందని ట్వీట్ చేశారు. ఇక రెండవ ట్వీట్‌గా ప్రెసిడెంట్ ఎన్నికల కోసం మిచెల్లీ ఒబామా ఈ ట్విట్టర్ ఎకౌంట్‌ని ఓ సాధనంగా ఉపయోగించనున్నారని ట్వీట్ చేశారు.

మిచెల్లీ ఒబామా ట్విట్టర్‌లో ఎకౌంట్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఐదుగురుని ఫాలో అయ్యారు. ఈ ఐదుగురిలో జిమ్ మెస్సినా, మేనేజర్ ఆఫ్ ఒబామా క్యాంపెయిన్ కాగా మిగిలిన మూడు ఎకౌంట్స్ వైట్ హౌస్ అధికారులకు సంబంధించినవి. వీటితో పాటు మిచెల్లీ తన భర్త ఒబామా ఎకౌంట్‌ని కూడా ఫాలో అవుతున్నారు. ఇక ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ట్విట్టర్ ఎకౌంట్‌ని 11మిలియన్ల జనాభా ఫాలో అవుతుండగా, ఒబామా కూడా సుమారు 683,000 ఎకౌంట్స్‌ని ఫాలో అవుతున్నారు. బరాక్ ఒబామా ఎప్పుడూ తన ట్వీట్స్‌ని మొదటి పదన ‘bo’తో ట్వీట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot