నోటి మాటతోనే..?

Posted By: Staff

నోటి మాటతోనే..?

 

దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్రాండ్ తాజాగా డిజైన్ చేసిన డ్యూయల్ సిమ్ ఫోన్ ‘ఏ50 ఆకా నింజా’ (A50 aka Ninja) సరికొత్త ఫీచర్లతో

వేడి పుట్టిస్తుంది. ఆండ్రాయిడ్ వోఎస్ ఆధారితంగా పనిచేసే ఈ ఫోన్లో  Aisha అనే వాయిస్ కమాండ్ అప్లికేషన్ ను నిక్షిప్తం చేశారు. సిరీ వాయిస్ కమాండ్ అప్లికేషన్ తరహాలో ఈ ఫీచర్ పని చేస్తుంది. ఈ సౌలభ్యతతో మీ మాటలు ఆధారితంగా ఫోన్ స్పందించడం మొదలుపెడుంది.

Aisha అంటే ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ స్పీచ్ హ్యాండ్ సెట్ అసిస్టెంట్’. ఈ అప్లేకేషన్ పదాలను చర్యలలోకి అనువదించగలదు. అంటే నోటీ ద్వారా మీరు ఇచ్చే కమాండ్‌లకు ఈ అప్లికేషన్ ప్రతిస్పందిస్తుంది.  ఉదాహరణకు:  ‘What is the weather in vijayawada’ అని మీరు వాయిస్ కమాండ్ ఇస్తే టక్కన ‘The weather will be hot and humid’

అని సమాధానం ఇస్తుంది.  ఈ సర్వీస్‌ను ఉపయోగించుకోవాలంటే ఫోన్‌లో తప్పనిసరిగా గుగూల్ ఆకౌంట్ అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఈ వాయిస్ అప్లికేషన్ ఆధారితంగా నెట్ బ్రౌజింగ్ వేగవంతంగా  నిర్వహించుకోవచ్చు. అంతే కాకుండా అనేక ఆన్‌లైన్ పనులను స్వల్ప వ్యవధిలో చక్కబెట్టుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో మైక్రోమ్యాక్స్ నింజా ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఫోన్ ధర రూ.4,999.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot