నోటితోనే దంచికొట్టండి!!

Posted By: Staff

నోటితోనే దంచికొట్టండి!!

 

దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్రాండ్ తాజాగా డిజైన్ చేసిన డ్యూయల్ సిమ్ ఫోన్ ‘ఏ50 ఆకా నింజా’ (A50 aka Ninja) సరికొత్త ఫీచర్లతో వేడి పుట్టిస్తుంది. ఆండ్రాయిడ్ వోఎస్ ఆధారితంగా పనిచేసే ఈ ఫోన్లో Aisha అనే వాయిస్ కమాండ్ అప్లికేషన్ ను నిక్షిప్తం చేశారు. సిరీ వాయిస్ కమాండ్ అప్లికేషన్ తరహాలో ఈ ఫీచర్ పని చేస్తుంది. ఈ సౌలభ్యతతో మీ మాటలు ఆధారితంగా ఫోన్ స్పందించడం మొదలుపెడుంది.

Aisha అంటే ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ స్పీచ్ హ్యాండ్ సెట్ అసిస్టెంట్’. ఈ అప్లేకేషన్ పదాలను చర్యలలోకి అనువదించగలదు. అంటే నోటీ ద్వారా మీరు ఇచ్చే కమాండ్‌లకు ఈ అప్లికేషన్ ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు: ‘What is the weather in vijayawada’ అని మీరు వాయిస్ కమాండ్ ఇస్తే టక్కన ‘The weather will be cloudy and rainy’అని సమాధానం ఇస్తుంది. ఈ సర్వీస్‌ను ఉపయోగించుకోవాలంటే ఫోన్‌లో తప్పనిసరిగా గుగూల్ ఆకౌంట్ అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఈ వాయిస్ అప్లికేషన్ ఆధారితంగా నెట్ బ్రౌజింగ్ వేగవంతంగా నిర్వహించుకోవచ్చు. అంతే కాకుండా అనేక ఆన్‌లైన్ పనులను స్వల్ప వ్యవధిలో చక్కబెట్టుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో మైక్రోమ్యాక్స్ నింజా ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఫోన్ ధర రూ.4,999.

Read more about:
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot