5000mAh బ్యాటరీతో మైక్రోమాక్స్ భారత్ 5 ప్లస్

మార్కెట్లో బాగా పాపులర్ అయిన మైక్రోమాక్స్ భారత్ సిరీస్ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది.

|

మార్కెట్లో బాగా పాపులర్ అయిన మైక్రోమాక్స్ భారత్ సిరీస్ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది. 'భారత్ 5 ప్లస్’ పేరుతో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ప్రస్తుతానికి ఈ స్మార్ట్‌ఫోన్ మైక్రోమాక్స్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయి ఉంది. ధర ఇంకా రిలీజ్ వివరాలు రివీల్ కావల్సి ఉంది. శక్తివంతమైన 5000mAh బ్యాటరీని ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Micromax Bharat 5 Plus With 5000mAh Battery Goes Official

ఫోన్ స్పెసిఫికేషన్స్....

5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 720x1280 పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్ సపోర్ట్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరిచుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (21 గంటల స్టాండ్ బై టైమ్), కనెక్టువిటీ ఫీచర్లు (4G VoLTE సపోర్ట్, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్).

Micromax Bharat 5 Plus With 5000mAh Battery Goes Official

నెల రోజుల క్రితమే మార్కెట్లోకి మైక్రోమాక్స్ భారత్ 5

మైక్రోమాక్స్ భారత్ 5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు జూనియర్ వర్షన్‌గా భావిస్తోన్న మైక్రోమాక్స్ భారత్ 5 నెల రోజుల క్రిందటే ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. ఆఫ్‌లైన్ మార్కెట్లో మాత్రమే లభ్యమవుతోన్న ఈ 4జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,55ి5. ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 720x 1280 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకనే అవకాశం, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5000mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4G VoLTE సపోర్ట్, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్).

ఈ ఏడు ఫోన్ల ధరలు శాశ్వతంగా తగ్గాయిఈ ఏడు ఫోన్ల ధరలు శాశ్వతంగా తగ్గాయి

Best Mobiles in India

English summary
Soon after the launch of the Micromax Bharat 5 earlier last month, Bharat 5 Plus is now seen listed on the company website. Not only the 4G smartphone listed on the website, the specifications of the phone have also been revealed by the company.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X