మైక్రోమాక్స్ నుంచి ‘కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రో’

|

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్, 'కాన్వాస్ ఇన్ఫినిటీ’ పేరుతో తన మొట్టమొదటి బీజిల్-లెస్ (ఎడ్జ్ టు ఎట్జ్ స్ర్కీన్) స్మార్ట్‌ఫోన్‌ను కొద్ది నెలల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గెెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ తరహాలో డిజైన్ కాబడిన ఈ ఫోన్ రూ.9,999 ప్రైస్ పాయింట్‌లో ఉత్తమ ఎంపికగా నిలిచింది.

Micromax Canvas Infinity Pro with bezel-less display to launch this month

18:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లేతో దాదాపుగా బీజిల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉన్న ఈ ఫుల్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ప్రెండ్లీ ధర ట్యాగ్‌లో బెస్ట్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ఫోన్‌గా గుర్తింపుతెచ్చుకుంది. 'కాన్వాస్ ఇన్ఫినిటీ’ స్మార్ట్‌ఫోన్‌కు మార్కెట్లో మంచి స్పందన లభించటంతో 'కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రో’ పేరుతో తరువాతి వర్షన్‌ను కూడా మైక్రోమాక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలస్తోంది. ఈ ఫోన్ రిటైల్ ప్యాకేజింగ్‌కు సంబంధించిన ఓ ఇమేజ్ ఒకటి ఇంటర్నెట్ ద్వారా లీక్ అయ్యింది.

ఈ ఇమేజ్ ప్రకారం కాన్వాస్ ఇన్ఫినిటీ 'ప్రో’ వేరియంట్, 5.7 అంగుళాల ఫుల్ విజున్ డిస్‌ప్లేతో రాబోతోంది. ఇదే సమయంలో రెండు సెల్ఫీ కెమెరాలను ఈ ఫోన్ క్యారీ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్‌కు సంబంధించి ఈ రెండు విషయాలు మాత్రమే బహిర్గతమయ్యాయి. త్వరలోనే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

గెలాక్సీ జే7 ప్రో పై రూ.1000 తగ్గింపుగెలాక్సీ జే7 ప్రో పై రూ.1000 తగ్గింపు

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ ఫోన్ టాప్ ఇంకా బోటమ్ ఎడ్జెస్ తప్పితే మిగిలిన బాడీ మొత్తం పూర్తి మెటల్‌తో కవర్ అయి ఉంటుంది. బ్రష్షుడ్ మెటల్ ఫినిషింగ్ ఆకట్టుకుంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది.

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ 5.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. 18:9 aspect ratioని కలిగి ఉండే ఈ డిస్‌ప్లే రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1440 x 720పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేసే వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి. వీడియోలను స్ట్రీమ్ చేస్తున్న సమయంలో, గేమ్స్ ఆడుతోన్న సమయంలో ఈ హైడెఫినిషన్ డిస్‌ప్లే మంచి వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

ఇన్ఫినిటీ స్మార్ట్‌ఫోన్‌కు 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. రియల్ టైమ్ బోకెహ్ ఎఫెక్ట్, ఆటో సీన్ డిటెక్షన్, 18:9 కెమెరా వంటి స్పెషల్ ఫీచర్స్ ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ కెమెరా f/2.0 apertureను కలిగి ఉంటుంది.

ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే..

ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2900mAh బ్యాటరీ, 4జీ VoLTE సపోర్ట్, యూఎస్బీ ఆన్ ద గో, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

Best Mobiles in India

Read more about:
English summary
Micromax Canvas Infinity Pro with a bezel-less display and dual selfie cameras to be launched later this month.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X