ఇక మైక్రోమాక్స్ విండోస్ స్మార్ట్‌ఫోన్‌లు!

|

ఈ ఏడాది ఆరంభంలో మైక్రోసాఫ్ట్ పలు ఇండియన్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మైక్రోమాక్స్ వచ్చిచేరింది. శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా బుధవారం జరిగిన మైక్రోసాఫ్ట్ బిల్డ్ కాన్ఫిరెన్స్ 2014 కీలక ఉపన్యాసంలో భాగంగా ఇండియాకు చెందిన మైక్రోమాక్స్, యూరోపియన్ దేశానికి చెందిన ప్రెస్టీజియో కంపెనీలతో విండోస్ ఫోన్‌ల రూపకల్పనకు సంబంధించి ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

ఇక మైక్రోమాక్స్ విండోస్ స్మార్ట్‌ఫోన్‌లు!

ప్రస్తుతం మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ ఆధారత స్మార్ట్‌ఫోన్‌ల తయారీ పై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. తాజా పరిణామాల నేపధ్యంలో మైక్రోమాక్స్ రూపొందించబోయే విండోస్ ఫోన్‌ల పై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకుంది.

భారతదేశపు రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ సీఈఎస్ 2014 వేదికగా రెండు ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేసే డ్యుయల్-బూట్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ‘మైక్రోమాక్స్ ల్యాప్‌టాబ్'గా నామకరణం చేయబడిన ఈ డ్యుయల్ - బూట్ డివైజ్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఇంకా విండోస్ 8.1 ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ ఆవిష్కరణతో డ్యుయల్-బూట్ టాబ్లెట్ డివైజ్‌ను పరిచయం చేసిన తొలి భారతీయ కంపెనీగా మైక్రోమాక్స్ గుర్తింపుతెచ్చుకుంది. మైక్రోమాక్స్ ల్యాప్‌టాబ్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే......

10.1 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,280 x 800పిక్సల్స్), 1.4గిగాహెట్జ్ ఇంటెల్ సిలిరాన్ ఎన్2805 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా స్టోరేజ్ సామర్ద్యాన్ని విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7,400ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డివైజ్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్, వైర్‌లెస్ కీబోర్డ్ వ్యవస్థ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X