Home
News

Flipkart Diwali Saleలో మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్ ప్రీ-బుకింగ్!!! ఛాన్స్ మిస్ అవ్వకండి

భారతీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ మైక్రోమాక్స్ ఇటీవల రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇందులో మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్‌ను ముందుగా ప్రీ-బుకింగ్ చేసుకోవడం కోసం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులో ఉంటుందని కంపెనీ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ దీపావళి సేల్ సందర్భంగా మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభిస్తోంది. ఈ ఫోన్ రెండు రకాల స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో మరియు మూడు కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మైక్రోమాక్స్ ఇన్ 1b ధర మరియు లభ్యత వివరాలు

మైక్రోమాక్స్ ఇన్ 1b ధర మరియు లభ్యత వివరాలు

మైక్రోమాక్స్ ఇన్ 1b స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ. 6,999 కాగా 4GB RAM + 64GB స్టోరేజ్ వెర్షన్ యొక్క ధర 7,999 రూపాయలు. మైక్రోమాక్స్ ఇండియా ట్వీట్ చేసినట్లుగా బిగ్ దీపావళి అమ్మకంలో ఈ ఫోన్ ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రీ-బుకింగ్ పద్దతిలో బ్లూ, గ్రీన్ మరియు పర్పుల్ అనే మూడు కలర్ ఎంపికలలో బుక్ చేయవచ్చు. అలాగే నవంబర్ 26 మధ్యాహ్నం 12 గంటల నుండి ఇది మొదటిసారిగా అమ్మకానికి వెళ్తుంది.

 

మైక్రోమాక్స్ ఇన్ 1b వాటర్‌డ్రాప్ డిజైన్ స్పెసిఫికేషన్స్

మైక్రోమాక్స్ ఇన్ 1b వాటర్‌డ్రాప్ డిజైన్ స్పెసిఫికేషన్స్

మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది వాటర్‌డ్రాప్ తరహా డిజైన్ తో 6.52-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G35 SoC చిప్ సెట్ ను కలిగి ఉండి ఇది 2GB మరియు 4GB RAM ఎంపికలతో జత చేయబడి వస్తుంది.

మైక్రోమాక్స్ ఇన్ 1b డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఫీచర్స్

మైక్రోమాక్స్ ఇన్ 1b డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఫీచర్స్

మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్ సెన్సార్ తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు ఎల్‌ఇడి ఫ్లాష్ ఉంటుంది. మైక్రోమాక్స్ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

మైక్రోమాక్స్ ఇన్ 1b 10W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్

మైక్రోమాక్స్ ఇన్ 1b 10W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్

స్టోరేజ్ ఫ్రంట్‌లో, మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్ 32GB మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇవి రెండూ మైక్రో SD కార్డ్ ద్వారా మరింత విస్తరించడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G వోల్టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, USB టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. చివరగా ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్ మరియు 10W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో బండిల్ చేయబడి వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Micromax In 1b Pre-Bookings Starts Today at 12PM on Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X