Micromax నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానున్నది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో

|

ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన యొక్క తదుపరి స్మార్ట్‌ఫోన్ మైక్రోమాక్స్ ఇన్ 2B ను జూలై 30 న భారతదేశంలో లాంచ్ చేయనున్నది. ఈ లాంచ్ యొక్క టీజర్‌ను కంపెనీ తన యొక్క ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇది లాంచ్ తేదీని మాత్రమే కాకుండా దాని డిజైన్‌ను కూడా ధృవీకరిస్తుంది. అలాగే లాంచ్ కు ముందే ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో లభ్యతను ధృవీకరిస్తూ ప్రత్యేకమైన పేజీలో మైక్రోమాక్స్ 2B ను ప్రచురించింది.

 

మైక్రోమాక్స్

మైక్రోమాక్స్ కంపెనీ విడుదల చేసిన ట్వీట్ లోని జాబితాలో మైక్రోమాక్స్ ఇన్ 2B యొక్క కొన్ని ఫీచర్లను కూడా వెల్లడించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ అప్రకటిత "హై-పవర్" ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది మాలి G52 GPU మద్దతుతో రావడం విశేషం. ఇది ముందు వాటితో పోల్చితే 30 శాతం మెరుగైన గ్రాఫిక్స్ పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

వాట్సాప్‌లో మీడియా సెట్టింగ్‌లను మార్చాలని చూస్తున్నారా??ఈ దశను అనుసరించండి!వాట్సాప్‌లో మీడియా సెట్టింగ్‌లను మార్చాలని చూస్తున్నారా??ఈ దశను అనుసరించండి!

మైక్రోమాక్స్ ఇన్ 2B యొక్క లీక్ లోని ఫీచర్ల విషయానికి వస్తే ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది అని సూచిస్తున్నది. ఇది 160 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 20 గంటల వెబ్ బ్రౌజింగ్, 15 గంటల వీడియో స్ట్రీమింగ్ మరియు 50 గంటల టాక్ టైంను అందిస్తుంది అని కంపెనీ ప్రత్యేకంగా తెలిపింది. అయితే మిగిలిన ఫీచర్ల వివరాలను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు.

వాటర్‌డ్రాప్-స్టైల్ నోచ్డ్ డిస్ప్లే
 

మైక్రోమాక్స్ సంస్థ విడుదల చేసిన టీజర్ ను బాగా గమనిస్తే ఇది వాటర్‌డ్రాప్-స్టైల్ నోచ్డ్ డిస్ప్లే ను కలిగి ఉండి దిగువన కొద్దిగా చిన్ ను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇది దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉన్న కెమెరా మాడ్యూల్‌లో ఉంచబడి ఉంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. వాల్యూమ్ మరియు పవర్ బటన్లు స్క్రీన్ యొక్క కుడివైపు అంచున ఉంచబడ్డాయి. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ప్రవణత నిగనిగలాడే ముగింపు ఉన్నట్లుంది.

మైక్రోమాక్స్ ఇన్ 2B స్మార్ట్‌ఫోన్

మైక్రోమాక్స్ ఇన్ 2B స్మార్ట్‌ఫోన్ జూలై 30న మధ్యాహ్నం 12:00 గంటలకు IST లో భారతదేశంలో ప్రారంభించబడుతుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ మరియు మైక్రోమాక్సిన్ఫో.కామ్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ సహా మూడు కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. ఈ కొత్త ఫోన్ 2020 లో ప్రారంభించిన మైక్రోమాక్స్ ఇన్ 1B కి సీక్వెల్ గా లాంచ్ కానున్నది అని భావిస్తున్నారు. గుర్తుచేసుకుంటే మైక్రోమాక్స్ ఇన్ 1B మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో ప్యాక్ చేయబడి రూ.6,999 ప్రారంభ ధర వద్ద ప్రారంభించబడింది.

Best Mobiles in India

English summary
Micromax In 2b Smartphone Plan to Launch in India on July 30: India Price, Specs, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X