మైక్రోమాక్స్ ఇన్ 2B ఫోన్‌ ధరలు పెరిగాయి!! అంతేకాకుండా మరొక కొత్త ఫోన్ లాంచ్

|

భారతీయ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ఇండియా మార్కెట్లో ఇప్పటికే లాంచ్ చేసిన తన యొక్క స్మార్ట్‌ఫోన్ ధరలను పెంచింది. అంతేకాకుండా కొత్తగా మరొక డివైజ్‌ను లాంచ్ చేసే పనిలో కూడా ఉంది. ధర పెంపును అందుకున్న ఫోన్ విషయానికి వస్తే మైక్రోమ్యాక్స్ ఇన్ 2B స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ గత నెలలోనే ప్రారంభించబడింది. లాంచ్ అయిన ఒక నెలలోనే ధరల పెంపును అందుకుందని గమనించండి. అయితే గిజ్మోచినా నివేదిక ప్రకారం ఇదే సమయంలో మైక్రోమ్యాక్స్ బ్రాండ్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ప్రో పేరుతో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు గీక్ బెంచ్ లిస్టింగ్‌లో గుర్తించబడింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మైక్రోమాక్స్ ఇన్ 2B కొత్త ధరల వివరాలు

మైక్రోమాక్స్ ఇన్ 2B కొత్త ధరల వివరాలు

మైక్రోమాక్స్ ఇన్ 2B స్మార్ట్‌ఫోన్ ధరల పెరుగుదలను అందుకొని ఇప్పుడు పెరిగిన కొత్త ధరతో అందుబాటులోకి వస్తుంది. మైక్రోమాక్స్ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ధరను రూ.500 పెంచింది. మైక్రోమ్యాక్స్ భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ ను రెండు వేరియంట్‌లలో అందిస్తుంది. అయితే ఈ రెండింటి వేరియంట్ల మీద ధరల పెరుగుదల లభించింది. 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ఇప్పుడు రూ.8,499 ధర వద్ద లభిస్తుంది మరియు 6GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.9,499 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క కొత్త ధరలు ఇప్పటికే Flipkart లో ప్రతిబింబిస్తోంది.

రియల్‌మి GT సిరీస్ ఫోన్‌లు లాంచ్ అయ్యాయి!! ధరలు,ఫీచర్స్ ఇవేరియల్‌మి GT సిరీస్ ఫోన్‌లు లాంచ్ అయ్యాయి!! ధరలు,ఫీచర్స్ ఇవే

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో స్పెసిఫికేషన్స్ (అంచనా)

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో స్పెసిఫికేషన్స్ (అంచనా)

మైక్రోమాక్స్ బ్రాండ్ నుంచి కొత్తగా రాబోతున్న మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ప్రో స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 యొక్క అప్ డేట్ వెర్షన్ గా రాబోతున్నట్లు భావిస్తున్నారు. ఇది మోడల్ నెంబర్ E7748_64 తో గీక్‌బెంచ్‌లో జాబితా చేయబడింది. లిస్టింగ్ ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G90 SoC ద్వారా శక్తిని పొందుతోంది.

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో యొక్క గీక్‌బెంచ్ స్కోర్లు సింగిల్-కోర్ పనితీరులో 519 మరియు మల్టీ-కోర్‌లో 1673 స్కోర్ చేసినట్లు చూపుతున్నాయి. ప్లాట్‌ఫారమ్‌లో జాబితా చేయబడిన ర్యామ్ వేరియంట్ 4GB. ఇది మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో మరిన్ని వేరియంట్లు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. లిస్టింగ్ అంటే మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో ప్రారంభించడం చాలా దూరంలో లేదు. స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్‌లు ఇంకా అందుబాటులో లేవు. కావున ఇతర సమాచారం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Micromax in 2B Smartphone Price Hiked! Also Launching New Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X