Micromax In 2c బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది!! లాంచ్ ఆఫర్లలో భారీ తగ్గింపు

|

భారతీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ నేడు ఇండియాలో కొత్తగా మైక్రోమ్యాక్స్ ఇన్ 2C స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మైక్రోమ్యాక్స్ ఫోన్ గత సంవత్సరంలో లాంచ్ అయిన మైక్రోమ్యాక్స్ In 2bని పోలి ఉండి దాని అప్ గ్రేడ్ వెర్షన్ గా విడుదలైంది. ఈ ఫోన్ వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే నాచ్‌ మరియు డ్యూయల్ రియర్ కెమెరా ఫీచర్లను కలిగి ఉండి ఆక్టా-కోర్ Unisoc T610 SoCతో రన్ అవుతుంది. దీనితో పాటుగా ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్‌, 5,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండి మార్కెట్ లో ఇన్ఫినిక్స్ హాట్ 11 2022, రియల్ మి C31 మరియు పోకో C3 వంటి వాటితో పోటీపడుతున్నది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మైక్రోమ్యాక్స్ ఇన్ 2C ధరల వివరాలు

మైక్రోమ్యాక్స్ ఇన్ 2C ధరల వివరాలు

మైక్రోమ్యాక్స్ ఇన్ 2C స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ అయింది. 3GB RAM + 32GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ రూ.8,499 ధర వద్ద బ్రౌన్ మరియు సిల్వర్ కలర్ లలో లభిస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ మరియు మైక్రోమ్యాక్స్ అధికారిక సైట్ ద్వారా మే 1 నుండి మొదటి సేల్స్ ప్రారంభం కానున్నాయి. పరిచయ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.7,499 తగ్గింపు ధరకే అందించనున్నది. అయితే ఈ లాంచ్ ఆఫర్ ఎంతకాలం అమల్లో ఉంటుంది అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

BHIM UPIని ఉపయోగించి UAE లో కూడా మీరు కొనుగోలు చేయవచ్చు!!BHIM UPIని ఉపయోగించి UAE లో కూడా మీరు కొనుగోలు చేయవచ్చు!!

మైక్రోమ్యాక్స్ ఇన్ 2C స్పెసిఫికేషన్స్
 

మైక్రోమ్యాక్స్ ఇన్ 2C స్పెసిఫికేషన్స్

మైక్రోమ్యాక్స్ ఇన్ 2C స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ద్వారా రన్ అవుతుంది. అలాగే ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 263ppi పిక్సెల్ డెన్సిటీతో 6.52-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ Unisoc T610 SoCతో శక్తిని పొందుతూ 3GB RAMతో జతచేయబడి ఉంది. డిస్‌ప్లే మరియు SoC యొక్క ఫీచర్స్ గత సంవత్సరం విడుదలైన మైక్రోమ్యాక్స్ ఇన్ 2bతో పొలిఉన్నాయి.

శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ త్వరలోనే ఆపిల్ బ్రాండ్ లో అందుబాటులోకి రానున్నది!!శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ త్వరలోనే ఆపిల్ బ్రాండ్ లో అందుబాటులోకి రానున్నది!!

ఆప్టిక్స్

మైక్రోమ్యాక్స్ ఇన్ 2C స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ మరియు 8-మెగాపిక్సెల్ కెమెరా ప్రత్యేక డెప్త్ సెన్సార్‌తో లభిస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది ఫేస్ బ్యూటీ, నైట్ మోడ్ మరియు పోర్ట్రెయిట్ మోడ్‌తో సహా ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. చివరిగా ఇది 10W స్టాండర్డ్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి 164.31x75.68x8.63mm కొలతల పరిమాణంలో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Micromax In 2c Smartphone Launched in India With Octa-Core Unisoc T610 SoC: Price, Specifications, Sale Date, Launch Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X