మైక్రోమాక్స్, జియోలతో రూ.1500 కోట్ల ఒప్పందం, రాష్ట్రమంతా ఉచిత స్మార్ట్‌ఫోన్‌లు

సంచార్ క్రాంతి యోజన పథకం క్రింద తమ రాష్ట్రంలోని మహిళలతో పాటు విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లను ఉచితంగా పంపిణీ చేసేందుకుగాను మైక్రోమాక్స్ ఇంకా రిలయన్స్ జియోలతో ప్రభుత్వం రూ.1500ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

|

సంచార్ క్రాంతి యోజన పథకం క్రింద తమ రాష్ట్రంలోని మహిళలతో పాటు విద్యార్థులకు 50 లక్షల స్మార్ట్‌ఫోన్‌లను ఉచితంగా పంపిణీ చేసేందుకుగాను మైక్రోమాక్స్ ఇంకా రిలయన్స్ జియోలతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.1500 ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 45 లక్షల స్మార్ట్‌ఫోన్‌లను మహిళలకు, మిగిలిన ఫోన్‌లను విద్యార్థులకు డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు మైక్రోమాక్స్ కో-ఫౌండర్ వికాస్ జెయిన్ పీటీఐకు తెలిపారు.

 

10,000 వరకు డిస్ట్రిబ్యూషన్ క్యాంప్స్..

10,000 వరకు డిస్ట్రిబ్యూషన్ క్యాంప్స్..

ఈ ఫోన్‌లకు సంబంధించిన డెలివరీ ప్రాసెస్ ఇప్పటికే మొదలయ్యందని, రాష్ట్రవ్యాప్తంగా వీటిని పంపిణీ చేసే క్రమంలో దాదాపుగా 10,000వరకు క్యాంపులను ఆర్గనైజ్ చేసినట్లు ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆధార్ అథంటికేషన్‌ను పూర్తి చేసి జియో కనెక్షన్‌తో కూడిన హ్యాండ్‌సెట్‌ను అందిస్తున్నట్లు జెయిన్ వెల్లడించారు.

 

 

2500 మంది తాత్కాలిక ఉద్యోగులు..

2500 మంది తాత్కాలిక ఉద్యోగులు..

ఫోన్‌లను డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో ఎక్కడా జాప్యం జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా 15 వేర్‌హౌసెస్‌లో ఫోన్‌లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. జూలై నాటికి పంపిణి ప్రాసెస్ పూర్తి చేయవల్సి ఉన్న నేపథ్యంలో 2000 నుంచి 2500 వరకు తాత్కాలిక సిబ్బందిని హైర్ చేసుకున్నట్లు జెయిన్ వివరించారు.

 

 

ఫోన్ స్పెసిఫికేషన్స్...
 

ఫోన్ స్పెసిఫికేషన్స్...

ఈ ప్రాజెక్ట్ క్రింద మహిళలకు అందిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లలో 4 ఇంచ్ డిస్‌ప్లే, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్పెక్స్ ఉన్నాయని జెయిన్ తెలిపారు. ఇదు సమయంలో విద్యార్థులకు అందిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లలో 5 ఇంచ్ డిస్‌ప్లే, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్పెసిఫికేషన్స్ పొందుపరిచినట్లు ఆయన వెల్లడించారు.

6 నెలల పాటు ఉచిత జియో బెనిఫిట్స్..

6 నెలల పాటు ఉచిత జియో బెనిఫిట్స్..

ఈ ప్రాజెక్ట్ పై రిలయన్స్ జియో అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ సంచార్ క్రాతీ యోజన పథకం క్రింద స్మార్ట్‌ఫోన్‌ను పొందే ప్రతి లబ్థిదారునికి నెలకు 1జీబి 4జీ డేటాతో పాటు 100 నిమిషాల వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. ఈ విధమైన బెనిఫిట్స్ వారికి 6 నెలల పాటు వర్తిస్తాయని ఆ తరువాత తమకు నచ్చిన ప్లాన్‌ను వారు ఎంపిక చేసుకునే వీలుంటుందని ఆయన తెలిపారు.

 

 

డిజిటల్ సాధికారితే లక్ష్యం..

డిజిటల్ సాధికారితే లక్ష్యం..

2011 జనాభా లెక్కల ప్రకారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2.5 కోట్ల జనాభా ఉన్నారు. ఈ నేపథ్యంలో దారిద్య రేఖకు దిగువున ఉన్న పేద మహిళలతో పాటు విద్యార్థులకు డిజిటిట్ కమ్యూనికేషన్ పట్ల అవగాహనను పెంచే క్రమంలో సంచార్ క్రాంతి యోజన పథకం క్రింద ఉచిత స్మార్ట్‌ఫోన్‌లను అందించాలని కంపెనీ భావించింది. దీంతో టెండర్ ప్రాసెస్ క్రింద ఈ ప్రాజెక్టును మైక్రోమాక్స్‌కు కేటాయించింది.

 

 

Best Mobiles in India

English summary
Micromax, Jio bag Rs 1,500 crore order from Chhattisgarh government.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X