Micromax కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి!! రూ.6000 బడ్జెట్ ధరలోనే...

|

మైక్రోమాక్స్ సంస్థ ఇండియాలో ఎట్టకేలకు తన "ఇన్" సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. అందరూ ఉహించినట్లుగా ఈ కొత్త సిరీస్‌లోని మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మరియు మైక్రోమాక్స్ ఇన్ 1b రెండూ మీడియాటెక్ చిప్‌సెట్‌లను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లో రన్ అవుతున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లపై రెండేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తామని మైక్రోమాక్స్ హామీ ఇచ్చింది.

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ vs చైనా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ vs చైనా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు

గురుగ్రామ్ ఆధారిత మైక్రోమాక్స్ సంస్థ ఒకప్పుడు భారతీయ మొబైల్ ఫోన్ మార్కెట్లో అగ్రగామిగా ఉండేది. ఏదేమైనా దేశంలో ఒప్పో, వివో, మరియు షియోమి వంటి చైనా బ్రాండ్ల ఆధిపత్యం పెరగడంతో మైక్రోమాక్స్ హవా పూర్తిగా తగ్గింది. ఇప్పుడు తన పూర్వ వైభవాన్ని పొందడానికి వర్చువల్ లాంచ్ ద్వారా బడ్జెట్ ధరలో చైనా బ్రాండ్లకు పోటీగా మైక్రోమాక్స్ సంస్థ రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వీటి విడుదల సందర్భంగా మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ సంస్థ యొక్క సౌకర్యాన్ని ప్రదర్శించారు మరియు 'మేక్ ఇన్ ఇండియా' చొరవలో భాగంగా రానున్న సంవత్సరంలో విడుదల చేయబోయే కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తి ప్రక్రియను వివరించారు.

 

Also Read: Jio vs Airtel vs Vi: పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలలో Jio, Airtelలను వెనక్కి నెట్టిన Vi....Also Read: Jio vs Airtel vs Vi: పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలలో Jio, Airtelలను వెనక్కి నెట్టిన Vi....

మైక్రోమాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ధరల వివరాలు

మైక్రోమాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ధరల వివరాలు

మైక్రోమాక్స్ సంస్థ తన యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌లను రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్ యొక్క 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.10,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.12,499. దీనితో పాటు విడుదల అయిన మైక్రోమాక్స్ ఇన్ 1b యొక్క 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.6,999 కాగా, 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.7,999. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 గ్రీన్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో నవంబర్ 24 నుండి అమ్మకాలకు రానున్నది. అలాగే మైక్రోమాక్స్ ఇన్ 1b మూడు విభిన్న కలర్ ఎంపికలలో లభిస్తుంది. దీని యొక్క అమ్మకాలు నవంబర్ 26 నుండి అందుబాటులోకి రానున్నాయి.

మైక్రోమాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల లభ్యత వివరాలు

మైక్రోమాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల లభ్యత వివరాలు

మైక్రోమాక్స్ యొక్క రెండు కొత్త ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ మరియు మైక్రోమాక్స్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఈ రెండు వెబ్‌సైట్లలో నేటి నుంచి రెండు కొత్త మోడళ్లకు రిజిస్ట్రేషన్లు తీసుకోవడం ప్రారంభిస్తాయి. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 రెడ్‌మి నోట్ 9 మరియు రియల్‌మి నార్జో 20 లతో పోటీ పడుతుండగా, మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్ రెడ్‌మి 9, పోకో C3, మరియు రియల్‌మి C15 వంటి వాటికి గట్టి పోటీగా ఉన్నాయి.

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్పెసిఫికేషన్స్

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్పెసిఫికేషన్స్

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేను పంచ్-హోల్ డిజైన్‌ నిర్మాణంతో కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G85 SoCను కలిగి ఉండి 4GB RAMతో జతచేయబడి ఉంటుంది. ఈ ఫోన్ వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెకండరీ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంది. మాక్రో షాట్లు మరియు డీప్ సెన్సింగ్ కోసం రెండు 2-మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇంకా కెమెరా సెటప్ LED ఫ్లాష్‌తో జత చేయబడి వస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మద్దతు గల ఫీచర్లతో పనిచేస్తుంది. అలాగే సెల్ఫీల కోసం ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంది. ఇది 78 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీ కెమెరా సాధారణ ఫోటోలు మరియు వీడియోలతో పాటు GIF లను కూడా షూట్ చేయగలదు.

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 5000mAh బ్యాటరీ ఫీచర్స్

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 5000mAh బ్యాటరీ ఫీచర్స్

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1యొక్క మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరిని 128GB వరకు విస్తరించడానికి అనుమతిని కూడా ఇస్తుంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G వోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చబడి ఉంటుంది. అంతేకాకుండా ఇది రివర్స్ ఛార్జింగ్ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతును ఇచ్చే 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

మైక్రోమాక్స్ ఇన్ 1b మీడియాటెక్ స్పెసిఫికేషన్స్

మైక్రోమాక్స్ ఇన్ 1b మీడియాటెక్ స్పెసిఫికేషన్స్

మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది వాటర్‌డ్రాప్ తరహా డిజైన్ తో 6.52-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G35 SoC చిప్ సెట్ ను కలిగి ఉండి ఇది 2GB మరియు 4GB RAM ఎంపికలతో జత చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్ సెన్సార్ తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు ఎల్‌ఇడి ఫ్లాష్ ఉంటుంది. మైక్రోమాక్స్ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

మైక్రోమాక్స్ ఇన్ 1b ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్స్

మైక్రోమాక్స్ ఇన్ 1b ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్స్

స్టోరేజ్ ఫ్రంట్‌లో, మైక్రోమాక్స్ ఇన్ 1b ఫోన్ 32GB మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇవి రెండూ మైక్రో SD కార్డ్ ద్వారా మరింత విస్తరించడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G వోల్టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, USB టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. చివరగా ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్ మరియు 10W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో బండిల్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Micromax New Smartphones In Note 1, In 1b Released in India: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X