కొత్తగా 20 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్న Micromax సంస్థ
భారతీయ స్మార్ట్‌ఫోన్ హ్యాండ్‌సెట్ తయారీ కంపెనీ మైక్రోమాక్స్ ఇండియా యొక్క స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి తిరిగి తన సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇండియాలో చైనా యొక్క యాప్ లను నిషేదించిన తరువాత ఇండియా సొంత మార్కెట్ మీద దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఒకప్పుడు అందరికి తక్కువ ధరలో ఫోన్ లను అందించిన మైక్రోమాక్స్ సంస్థ ఇప్పుడు మళ్ళి తన మార్కెట్ ను పెంచుకునే పనిలో పడింది. చైనా ప్యతిరేకత ఇప్పుడు దీనికి మంచి మరికొద్దిగా సాయం చేస్తున్నది.

మైక్రోమాక్స్ కంపెనీ 20 కొత్త హ్యాండ్‌సెట్‌లు
మైక్రోమాక్స్ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కనీసం 20 రకాల కొత్త హ్యాండ్‌సెట్‌లను ఇండియాలో విడుదల చేయాలని కంపెనీ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. ఇప్పటికే వీటి యొక్క R&D తయారీకి దాదాపుగా 500 కోట్లు కేటాయించింది. వచ్చే నెల చివరి నాటికి మైక్రోమాక్స్ తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మైక్రోమాక్స్ కో-ఫౌండర్
మైక్రోమాక్స్ సంస్థ యొక్క సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో సంస్థ ప్రపంచం మొత్తం మీద లాంచ్ చేయబోయే స్మార్ట్‌ఫోన్ హ్యాండ్‌సెట్ల ద్వారా ఇండియాలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన స్థానాన్ని తిరిగి పొందాలని కంపెనీ చూస్తోంది. సంస్థ యొక్క కొత్త ఫోన్లు ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి అని కూడా హామీ ఇచ్చారు.

ఇండియాలో చైనా వ్యతిరేక భావాలు
ఇండియాలో ప్రస్తుతం నెలకొన్న చైనా వ్యతిరేక భావాల నేపథ్యంలో మైక్రోమాక్స్ పునరాగమనను రూపొందించారనే భావనను శర్మ ఖండించారు. ఇండియా యొక్క స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి తిరిగి రావడానికి కంపెనీ చాలా ఎక్కువ కాలం నుంచి ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. అలాగే ఒక సంవత్సరం క్రితం యుఎస్-చైనా వాణిజ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రపంచ స్థాయిలో ఇటువంటి అవకాశాన్ని మేము ముందుగానే గ్రహించాము. ఇండియాలో చైనా వ్యతిరేక భావన ఇటీవల మొదలైంది. కావున ఎవరు కూడా రాత్రికి రాత్రి స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభించటానికి ప్లాన్ చేయలేరు అని శర్మ తెలిపారు.

ఇండియాలో మైక్రోమాక్స్ మార్కెట్
ఇండియాలోకి చైనీస్ బ్రాండ్లు రియల్ మి, షియోమి వంటివి రాకముందు ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో మైక్రోమాక్స్ సంస్థ మొదటి వరుసలో ఉండేది. ఒక దశలో 2014 సంవత్సరం Q4లో మార్కెట్ వాటా పరంగా మైక్రోమాక్స్ సంస్థ శామ్‌సంగ్‌ను కూడా అధిగమించింది. చాలా తక్కువ ధరకు ఉన్నతమైన ఉత్పత్తులను అందించే చైనా కంపెనీలకు కంపెనీ మరియు అనేక భారతీయ హ్యాండ్‌సెట్ కంపెనీలు వేగంగా నష్టపోయాయి. చైనీస్ బ్రాండ్లు పెద్ద మార్కెటింగ్ మరియు ప్రకటనల బడ్జెట్లతో కూడా వచ్చాయి.

ఇండియా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు
మైక్రోమాక్స్ మరియు ఇతర భారతీయ కంపెనీలు ఇప్పుడు దేశీయ కంపెనీలకు సహాయం చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ పిఎల్‌ఐ పథకంపై పెద్ద ఎత్తున బెట్టింగ్ చేస్తున్నాయి. ఇండస్ట్రీ బాడీ ICEA ప్రకారం ఆప్టిమస్ ప్రోడక్ట్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కిమ్ కింద ప్రయోజనాలను పొందుతున్న సంస్థలలో లావా, డిక్సన్, మైక్రోమాక్స్, ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, సోజో, యుటిఎల్ వంటి సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications







