మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది!! ఎప్పుడో తెలుసా?

|

భారతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి తిరిగి కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో మళ్ళి ప్రవేశించింది. ఇప్పుడు కంపెనీ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని తన యొక్క ప్రయత్నాలను వేగవంతం చేసింది. కొత్త లీక్ ప్రకారం కంపెనీ డిసెంబర్ మధ్యలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయాలని చూస్తోంది. టిప్‌స్టర్ హృదేశ్ మిశ్రా ప్రకారం మైక్రోమ్యాక్స్ తన తదుపరి లైనప్ స్మార్ట్‌ఫోన్‌లను డిసెంబర్ 15న విడుదల చేయాలని చూస్తోంది. అయితే ప్రస్తుతం కొత్త ఫోన్‌ల పేర్లు మరియు స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. ఈ లీక్ కు సంబందించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మైక్రోమ్యాక్స్

మైక్రోమ్యాక్స్ కంపెనీ దేశంలో మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉందని గతంలోనే చెప్పబడింది. దీనికి ఉద్దేశించిన హ్యాండ్‌సెట్ మోడల్ నంబర్ E7748తో గీక్‌బెంచ్‌లో గుర్తించబడింది. ఈ డివైస్ MediaTek MT6785 SoCతో గుర్తించబడింది ఇది MediaTek Helio G90 చిప్‌సెట్ కావచ్చు. ఇది కాకుండా ఈ ఫోన్ 4GB RAMతో జతచేయబడి ఉండడమే కాకుండా గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తుంది అని అంచనాలు ఉన్నాయి.

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో

గీక్‌బెంచ్ జాబితా ప్రకారం మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో సింగిల్-కోర్ స్కోర్ 519 మరియు మల్టీ-కోర్ స్కోర్ 1,673 సాధించగలిగింది. కంపెనీ మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రోని వచ్చే నెలలో లాంచ్ చేస్తుందా లేదా అనేది ప్రస్తుతం స్పష్టంగా తెలియలేదు. గుర్తుచేసుకుంటే కనుక మైక్రోమ్యాక్స్ తిరిగి ఆగస్టులో మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది. ఇది మైక్రోమ్యాక్స్ ఇన్ 1బికి వారసుడిగా అందుబాటులోకి వచ్చింది. ఇది 4GB RAM/64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.7,999 మరియు 6GB RAM/64GB స్టోరేజ్ మోడల్ రూ.8,999 ధర వద్ద లాంచ్ అయింది.

Unisoc
 

Micromax In 2B Unisoc T610 octa-core SoC ద్వారా ఆధారితం మరియు Google యొక్క Android 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తుంది. పరికరం 5,000mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో జత చేయబడిన 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

మైక్రోమాక్స్ ఇన్ 1 స్పెసిఫికేషన్స్

మైక్రోమాక్స్ ఇన్ 1 స్పెసిఫికేషన్స్

మైక్రోమాక్స్ యొక్క కొత్త ఫోన్ ఎంట్రీ లెవల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉండి ట్రిపుల్ కెమెరా సెటప్, 6.7-అంగుళాల పెద్ద డిస్ప్లే మరియు 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. మైక్రోమాక్స్ ఇన్ మరియు ఇన్ నోట్ 1 గత సంవత్సరం విడుదల అయింది. ఈ ఇన్ నోట్ 1 ఫోన్ 20: 9 కారక నిష్పత్తితో 6.67-అంగుళాల FHD + డిస్ప్లేతో 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మరియు మీడియాటెక్ హెలియో G85 తో జతచేయబడి వస్తుంది. మైక్రోమాక్స్ ఇన్ 1 ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్ తో 48 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్, ఫీల్డ్ డీప్ కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెంట్రల్ హోల్-పంచ్ కటౌట్‌లో 4.6mm వ్యాసంతో కలిగి ఉంది. మైక్రోమాక్స్ ఇన్ 1 ఫోన్ యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, 4G, డ్యూయల్-VoLTE, డ్యూయల్-వోవైఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్ మరియు USB టైప్-సి పోర్ట్‌ వంటివి కలిగి ఉన్నాయి. సెన్సార్ ఆన్‌బోర్డ్‌లో సామీప్య సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, దిక్సూచి, గైరోస్కోప్ మరియు గ్రావిటీ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఇది ఫేస్ అన్‌లాక్‌తో పాటు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంది. అలాగే ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ కు మద్దతును ఇచ్చే 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Micromax Plan to Launch New Budget Smartphones in India on December 15: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X