జెనీలియా హోరు.. తాప్సి జోరు!

Posted By: Super

జెనీలియా హోరు.. తాప్సి జోరు!

 

న్యూఢిల్లీ: ప్రముఖ హిరోయిన్లు జెనీలియా, తాప్సీ మంగళవారం వేరు వేరు ఆవిష్కరణల్లో కనవిందు చేసారు. వివరాల్లో వెళితే.. మొబైల్ తయారీ రంగంలో దేశీయంగా దూసుకుపోతున్న మైక్రోమ్యాక్స్ మంగళవారం తొలిసారిగా ఎల్‌టీఈడీ టీవీలను విడుదల చేసింది. 24 నుంచి 55 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ సొగసరి శ్రేణి టీవీల ధరలు రూ.15,990- 1,29,990 మధ్య ఉంటాయి. రూ.5000 ఖరీదుతో స్మార్ట్ స్టిక్‌ను కూడా మైక్రోమ్యాక్స్ అందించనుంది. స్మార్ట్ స్టిక్‌ను ఉపయోగించి వినియోగదారులు టెలివిజన్ సెట్లలో ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. ఎల్ఈడి టీవీల విభాగం నుంచి రూ.140-225 కోట్ల రాబడిని సాధించాలని ఆశిస్తున్నామని మైక్రోమ్యాక్స్ ఎండీ, సహ వ్యవస్థాపకుడు రాజేశ్ అగర్వాల్ చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటి జెనీలియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

తాప్సి చేతుల మీదగా కింగ్ టాబ్, స్మార్ట్‌ఫోన్!

హైదరాబాద్: కింగ్ ఐ-టాబ్ ట్రేడింగ్ కంపెనీ మంగళవారం 20 రకాల కింగ్ టాబ్లెట్ పీసీలతో పాటు 20 మోడళ్ల కింగ్ ఫోన్‌లను విడుదల చేసింది. వీటిని సినీనటి తాప్పి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ దేశీయ మార్కెటింగ్ విభాగాధిపతి ఆర్.తెన్నేటి మాట్లాడుతూ... వివిధ శ్రేణుల్లో డిజైన్ కాబడిన టాబ్లెట్ పీసీల ధరలను రూ.3999 నుంచి 35,000వరకు వివిధ శ్రేణుల్లో నిర్ణయించామన్నారు. టచ్ స్ర్కీన్, డ్యూయల్ సిమ్ తో కూడిన వివిధ ఫోన్ల ధరలు మోడల్ ను బట్టి రూ.3999 నుంచి రూ. 25,000 వరకు నిర్ణయించినట్లు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot