సూర్యుడి నుంచి మొబైల్ ఛార్జింగ్!!

దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ మరి కొద్ది రోజుల్లో ఓ వినూత్న ఆలోచనను ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. విద్యుత్ ఖర్చు లేకుండా సోలార్ ఛార్జర్‌తో పనిచేసే మొబైల్ ఫోన్‌ను ఈ బ్రాండ్ త్వరలో అందుబాటులోకి తేనుంది. మొబైల్‌కు అమర్చే ఈ సోలార్ ప్యానల్ మూడు గంటల్లో డివైజ్‌ను సంపూర్ణంగా ఛార్జ్ చేస్తుంది. ఈ ఛార్జింగ్ 1.5గంటల టాక్‌టైమ్ నిస్తుంది.
ఈ అంశం పై మైక్రోమ్యాక్స్ సహా వ్యవస్థాపకులు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ శర్మ స్పందిస్తూ మరిన్ని కొత్త తరహా ఆవిష్కరణల పై దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. ముందుగా తాము సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండే సమర్ధవంతమైన డ్యూయల్ సిమ్‌ఫోన్‌ల ఉత్ప్తత్తి పై దృష్గిసారించినట్లు పేర్కొన్నారు. సోలార్ ప్యానల్ ఆధారితంగా పనిచేసే మొబైల్ ఫోన్‌ను వచ్చే వారం లాంఛ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈ కొత్త డివైజ్‌కు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సాధారణ ఫీచర్‌ఫోన్ వొడఫోన్ VF 247 తరహాలో ఉంటుంది. ధర అంచనా రూ.1500. ఇదిలా ఉండగా మైక్రోమ్యాక్స్, ఫన్‌బుక్ పేరుతో తొలి టాబ్లెట్ పీసీనీ మంగళవారం లాంఛ్ చేసింది. ఆ డివైజ్ ఫీచర్లు అదే విధంగా పనితీరు క్లుప్తంగా....
ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవనుంది. తక్కువ ధర గ్యాడ్జెట్ అయినప్పటికి పనితీరు విషయంలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తుంది. నిక్షిప్తం చేసిన 1.2 జిగాహెడ్జ్ ప్రాసెసర్ డివైజ్ పనివేగాన్ని రెట్టింపు చేస్తుంది.
7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే 800 x 480 పిక్సల్ హై రిసల్యూషన్‌ను కలిగి ఉంటుంది. మల్టీ టచ్ ఇన్‌పుట్‌లతో పాటు జూమ్ ఆప్షన్‌లను సపోర్ట్ చేస్తుంది. పీసీలో నిక్షిప్తం చేసిన మన్నికైన గ్రాఫిక్ ప్రాసెసర్ ఉత్తమమైన మల్టీ మీడియా అనుభూతులను చేరవచేస్తుంది. ఇంటర్నల్ మెమెరీ 4జీబి, ర్యామ్ సామర్ద్యం 512ఎంబీ. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు.
ఏర్పాటు చేసిన వై-ఫై, 3జీ కనెక్టువిటీ వ్యవస్థలు వేగవంతమైన ఇంటర్నెట్‌ను సపోర్ట్ చేస్తాయి. వినియోగదారుడు ఈ టాబ్లెట్ కోనుగోలు పై టాటా ఫూటాన్ EVDO డేటా కార్డును ఉచితంగా పొందవచ్చు. కొన్ని నెలల పాటు ఈ కార్డ్ నుంచి 1జీజి డేటా వరకు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
బ్లాక్ మరియు స్లేట్ గ్రే కలర్ వేరియంట్‌లలో ఈ గ్యాడ్జెట్ డిజైన్ కాబడింది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన వీజీఏ ఫ్రంట్ కెమెరా 0.3 మెగా పిక్సల్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పలు బేసిక్ అప్లికేషన్‌లను ముందుగానే ప్రీలోడ్ చేశారు. ఎంబీఏ, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు కోసం స్టడీ మెటీరియల్‌ను పీసీలో నిక్షిప్తం చేశారు. ధర రూ.6,499.


Click it and Unblock the Notifications