‘ప్రపంచపు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్’ మొదటి ఇంప్రెషన్స్
మైక్రోమాక్స్ తన యూ టెలీవెంచర్స్ నుంచి ఇటీవల విడుదల చేసిన ఫోన్ యుటోపియా. ఇండియన్ బ్రాండ్ నుంచి విడుదలైన ఈ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ శక్తివంతమైన స్పెక్స్‌తో మార్కెట్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ ఫోన్‌తో ప్యాక్ అయిన అత్యుత్తమ డిస్‌ప్లే, శక్తివంతమైన ఇంటర్నల్ ఫీచర్లు, మన్నికైన బ్యాటరీలైఫ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అంశాలు డివైస్‌ను బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్లో తిరుగులేని శక్తిలా నిలబెట్టాయి. ప్రపంచపు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణించబడుతోన్న యుటోపియా ఫోన్ మొదటి ఇంప్రెషన్స్‌ను క్రింది వీడియోలో చూడొచ్చు...
యు యుటోపియా స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెక్స్
5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్, 565 పీపీఐ), ప్యూర్ బ్లాక్ టచ్ ప్యానల్, ఓజీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, 2గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్4 ర్యామ్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, ఫేస్‌డిటెక్ట్ ఆటో ఫోకస్, 4కే రికార్డింగ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్విక్ చార్జ్ 2.0 టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ కస్టమ్ స్కిన్‌తో ఉన్న శ్యానోజెన్ మోడ్ 12.1 ఆపరేటింగ్ సిస్టం, డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ.


Click it and Unblock the Notifications








