యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను 70 బిలియన్ డాలర్లకు కొనుగోలుచేసిన మైక్రోసాఫ్ట్....

|

Xbox వినియోగదారులకు ఊహించని విధంగా కొత్త సంవత్సరంలో మంచి శుభవార్త వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే కాల్ ఆఫ్ డ్యూటీ మరియు కాండీ క్రష్ వంటి గేమ్లకు ప్రసిద్ధి చెందిన వీడియో గేమ్ స్టూడియో యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేసినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. Xbox కోసం ప్రత్యేకమైన లైబ్రరీని విస్తరించడానికి మరియు ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొనిపోవడానికి వీలుగా ఈ సముపార్జన ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ సంస్థకి సహాయం చేస్తుంది.

 

గేమ్ స్టూడియో యాక్టివిజన్ బ్లిజార్డ్‌

ప్రముఖ వీడియో గేమ్ స్టూడియో యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ సొంతం చేసుకోవడానికి దాదాపుగా $68.7 బిలియన్లను చెల్లించినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవలి కాలంలో జరిపిన అతిపెద్ద టెక్నాలజీ సముపార్జనలలో ఒకటిగా నిలిచింది. మైక్రోసాఫ్ట్ చాలా కంపెనీలను కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థ లింక్డ్‌ఇన్‌ను 2016లో సుమారు $26 బిలియన్ల మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది.

యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీ కొనుగోలు చేసినప్పటికీ ప్రస్తుత బాబీ కోటిక్ CEO మైక్రోసాఫ్ట్ తరపున గేమింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తారు. మైక్రోసాఫ్ట్ ప్రకారం ఇది మొబైల్ గేమింగ్ పోర్ట్‌ఫోలియోలో తన బలాన్ని పెంపొందించడానికి కంపెనీకి సహాయపడుతుంది. ఈ సరికొత్త ఒప్పందం మైక్రోసాఫ్ట్‌ను ప్రపంచంలోని మూడవ అతిపెద్ద గేమింగ్ కంపెనీగా ఎదిగే అవకాశం ఉంది. టెన్సెంట్ మరియు సోనీ సంస్థలు మొదటి మరియు రెండవ స్థానాల్లో ఉన్నాయి.

Xbox గేమ్‌పాస్ వినియోగదారులకు శుభవార్త
 

Xbox గేమ్‌పాస్ వినియోగదారులకు శుభవార్త

యాక్టివిజన్ బ్లిజార్డ్‌ మరియు మైక్రోసాఫ్ట్ సంస్థల కొత్త డీల్ కారణంగా Xbox గేమ్‌పాస్ వినియోగదారులు కూడా Xbox మరియు PCలో యాక్టివిజన్ గేమ్‌లను ఉచితంగా యాక్సెస్ చేయగలుగుతారు. ముఖ్యంగా వార్‌క్రాఫ్ట్, డయాబ్లో, ఓవర్‌వాచ్, కాల్ ఆఫ్ డ్యూటీ మరియు క్యాండీ క్రష్ వంటి అనేక ఫ్రాంచైజీల గేమ్‌లు గేమ్‌పాస్ సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులో ఉంటాయి. కొత్త మరియు పాత టైటిల్స్ రెండింటినీ కలిగి ఉన్న వీలైనన్ని ఎక్కువ గేమ్‌లను జోడిస్తుందని కంపెనీ ధృవీకరించింది.

Microsoft టీమ్స్ యాప్‌లో కొత్తగా 5 టెక్నాలజీ ఫీచర్లు చేరాయి!! వివరాలు ఇవిగోMicrosoft టీమ్స్ యాప్‌లో కొత్తగా 5 టెక్నాలజీ ఫీచర్లు చేరాయి!! వివరాలు ఇవిగో

డూమ్ ఎటర్నల్స్

మైక్రోసాఫ్ట్ సంస్థ 2021లో బెథెస్డాను కూడా కొనుగోలు చేసింది. ఇది ఫాల్అవుట్, డెత్‌లూప్ మరియు డూమ్ ఎటర్నల్స్ వంటి టైటిల్‌లకు ప్రసిద్ధి చెందిన అతి పెద్ద వీడియో గేమ్ స్టూడియో కావడం గమనార్హం. దీనిని కొనుగోలు చేయడం కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ సుమారు $7.5 బిలియన్లను చెల్లించింది. ఇది యాక్టివిజన్ బ్లిజార్డ్‌కు చెల్లించిన దానితో పోలిస్తే కేవలం 10 శాతం మాత్రమే.

రెగ్యులేటరీ అనుమతులను

వివిధ దేశాల నుండి అనేక రకాల రెగ్యులేటరీ అనుమతులను పూర్తి చేయాల్సి ఉన్నందున ఈ రెండింటి మధ్య ఒప్పందం 2023 ఆర్థిక సంవత్సరంలో ముగుస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇది కూడా క్యాష్‌అవుట్ డీల్ అయినందున మైక్రోసాఫ్ట్‌కు అధిక మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా స్టూడియో యొక్క అసలు వ్యవస్థాపకులు మరియు పెట్టుబడిదారులు అధిక మొత్తంలోనే డబ్బును సంపాదించుకునే అవకాశం ఉంది.

Xbox

వీడియో గేమింగ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో ఒకటి. ఇది బిలియన్ డాలర్ల పరిశ్రమ కూడా. ఇలాంటి డీల్‌లు మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలకు మరింత మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి తమ కన్సోల్‌ల కోసం ప్రత్యేకమైన గేమ్‌లను రూపొందించడంలో సహాయపడతాయి. ఈ ఒప్పందం రాబోయే సంవత్సరాల్లో Xboxకి చాలా ప్రత్యేకమైన గేమ్‌లు వస్తున్నాయని నిర్ధారిస్తుంది.

Best Mobiles in India

English summary
Microsoft Acquires Activision Blizzard For A Whopping $70 Billion: Good News For Xbox Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X