మైక్రోసాప్ట్, నోకియా సంయుక్తంగా ఫిన్‌ల్యాండ్‌లో

Posted By: Staff

 మైక్రోసాప్ట్, నోకియా సంయుక్తంగా ఫిన్‌ల్యాండ్‌లో

 

మైక్రోసాప్ట్, నోకియా సంయుక్తంగా ఫిన్‌ల్యాండ్ లో ఉన్న ఆల్టో విశ్వవిద్యాలయంలో 'అప్లికేషన్ క్యాంపస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్' పేరు మీద నిర్వహించనున్న కార్యక్రమానికి గాను $24 మిలియన్లను ఖర్చు చేయనుంది. ఈ కార్యక్రమం వల్ల మైక్రోసాప్ట్ విండోస్ ఫోన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు సింబియన్, సిరిస్ 40 ఆపరేటింగ్ సిస్టమ్‌లకు కోసం కొత్త మొబైల్ అప్లికేషన్స్‌ని రూపొందించేందుకు సహాయపడనుంది.

మే 2012 నుండి ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని ఆల్టో విశ్వవిద్యాలయం దగ్గరుండి మరీ చూసుకోనుంది. ఆల్టో విశ్వవిద్యాలయానికి ఫిన్నిష్ మొబైల్ తయారీదారుకి మద్య మంచి సంబంధాలు ఉండడంతో పాటు.. గతంలో ఆల్టో విశ్వవిద్యాలయం తమ సేవలను అందించడమే దీనికి కారణం. ఈ విశ్వవిద్యాలయం లోకేషన్‌తో పాటు కోచింగ్ సర్వీస్‌లను అందించడంతో పాటు అప్లికేషన్ డెవలపర్స్‌కు బిజినెస్ నెట్ వర్క్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.

సీనియర్ మొబైల్ ప్రోగ్రామర్స్ ఈ కార్యక్రమానికి మెంటార్స్‌గా వ్యవహారిస్తారు. అంతర్జాతీయంగా మైక్రోసాప్ట్ అప్లికేషన్ స్టోర్ 70,000 వినియోగదారులను సొంతం చేసుకున్నప్పటికీ... ఆపిల్ ఐవోఎస్, గూగుల్ ప్లే స్టోర్స్‌లతో పొల్చితే వెనుకబడి ఉంది. ఇక ఇటీవల కాలంలో మైక్రోసాప్ట్ నిర్వహించిన సర్వేలో ఎక్కువ అప్లికేషన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల వినియోగదారులు వేరే వాటి వైపు చూస్తున్నారని తెలియగానే.. మైక్రోసాప్ట్ వారిని అరికట్టేందుకు గాను ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot