మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల్లో భారీ కోత..?

Posted By:

దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన చరిత్రలోనే భారీ ఉద్యోగ కొతకు శ్రీకారం చుట్టనుందని వెబ్ ప్రపంచంలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఉద్యోగాల్లో భారీ కోత విధించేందుకు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఈ వారంలోనే ఇందుకు సంబంధించిన సమాచారం అధికారికంగా వెలువడవచ్చని బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది.

మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల్లో భారీ కోత..?

నోకియా హ్యాండ్‌సెట్ విభాగాన్ని కొనుగోలు చేసిన అనంతరం మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల సంఖ్య 1,27,104కు చేరింది. ఇందులో నోకియా ఉద్యోగులే 30,000మంది ఉన్నారు. ఈ నేపధ్యంలో కంపెనీ నిర్వహణ వ్యయం అధికమవుతోంది. ఈ క్రమంలో నోకియా సిబ్బందితో పాటు వ్యాపారం - మార్కెటింగ్‌కు సంబంధించి ఇరు సంస్థల్లో ఒక రకమైన విధులను నిర్వహిస్తున్న వారిలో కొందరిని, ఇంజినీరింగ్ విభాగంలో కూడా కొందరిని తొలిగించేందుకు మైక్రోసాఫ్ట్ సన్నాహాలు చేస్తోందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot