Just In
- 8 min ago
Dell నుంచి కొత్త Laptop లాంచ్ అయింది ! ధర & స్పెసిఫికేషన్లు చూడండి.
- 1 hr ago
Moto Tab G62 టాబ్లెట్ విడుదలైంది!! ధరల మీద ఓ లుక్ వేయండి...
- 2 hrs ago
Vivo V25 Pro 5G కలర్ మారే స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
- 3 hrs ago
Airtel ముందస్తు స్పెక్ట్రమ్ చెల్లింపుగా DoTకి ఎంత చెల్లించిందో తెలుసా?
Don't Miss
- Automobiles
త్వరలో విడుదలకానున్న 'హోండా యాక్టివా 6జి ప్రీమియం ఎడిషన్': ఫోటోలు
- Lifestyle
Health Benefits of Ragi : ఈ ఒక్క పదార్ధం కలిగిన ఆహారాలు రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి!
- Sports
SA vs Eng 1st Test Playing 11 : బాజ్‌బాల్ అంతుచూడ్డానికి ప్రోటీస్ సై..! ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా తుది టీంలు!
- News
ఉచితాలపై సుప్రీం కీలక ప్రశ్నలు-రాజకీయ పార్టీల్ని ఆపలేం- ఏది సంక్షేమమో తేల్చాల్సిందే..
- Travel
నైనిటాల్ పర్యటనలో ఈ ప్రదేశాలు అస్సలు మిస్సవ్వొద్దు
- Movies
Guppedantha Manasu రిషి పెళ్లి ఆగిపోతే స్వీట్లు పంచుకొంటారా? జగతికి దేవయాని షాక్
- Finance
Gold: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గోల్డ్ ట్రేడర్.. ఎలా కుప్పకూలింది..? ఆ మోసంతో..
ఇక అప్పటితో Windows 8.1 ఓఎస్ యూజర్లకు సపోర్ట్ ఉండదు!
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. Windows 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చే ఏడాది (2023) జనవరి చివరి వరకు సపోర్ట్ చేస్తుందని ప్రకటన చేసింది. విండోస్ కి సంబంధించిన పాత వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ కు సాంకేతిక సహకారం మరియు సెక్యూరిటీ అప్డేట్స్ జనవరి 10, 2023 తర్వాత అందించడం జరగదని టెక్ దిగ్గజం తెలిపింది. ఈ మేరకు కంపెనీ తమ సపోర్ట్ వెబ్సైట్ వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించింది.

కొత్త వర్శన్‌కు అప్డేట్ అవ్వాలి:
మైక్రోసాఫ్ట్ సంస్థ వెబ్సైట్లో వెల్లడించిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. Windows 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించి కంపెనీ 2023, జనవరి వరకు సపోర్ట్ ఇస్తుందని తెలపింది. ఇప్పటికీ ఇంకా ఎవరైనా యూజర్లు ఈ పాత వర్శన్‌ను వాడే వాళ్లు ఉంటే.. వారు తమ వ్యక్తిగత కంప్యూటర్లలో లేటెస్ట్ వర్శన్ Windows 11 అప్డేట్ చేసుకోవాలని కోరింది. 2023, జనవరి 10 వతేదీ తర్వాత నుంచి పాత వర్శన్ ఓఎస్‌కు సంబంధించి సెక్యూరిటీ అప్డేట్స్, సాంకేతిక సహకారం నిలిపి వేయనున్నట్లు సూచించింది. ఇందుకు సంబంధించిన ప్రకటనతో పాటుగా యూజర్ల అనుమానాలను నివృత్తి చేసేందుకు పలు కామన్ ప్రశ్నలకు (ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్) సమాధానాలను కూడా నివృత్తి చేస్తూ ఓ డాక్యూమెంట్‌ను కంపెనీ పబ్లిష్ చేసింది. 2023, జనవరి తర్వాత విండోస్ 8.1లో ఉండడం వల్ల మీ పీసీ ప్రమాదంలో పడేందుకు ఆస్కారం ఉంటుందని కంపెనీ హెచ్చరించింది. పలు మాల్వేర్ వైరస్లు పీసీలోకి వచ్చే అవకాశం ఉంటుందని జాగ్రత్త పడాలని హెచ్చరించింది.

కేవలం సపోర్ట్ మాత్రం ఆగిపోతుంది.
Windows 8.1 కి సపోర్ట్ నిలిపివేయడం అంటే కేవలం సెక్యూరిటీ మరియు సాఫ్ట్వేర్ అప్డేట్స్ మాత్రమే ఆగిపోతాయి. అంతేకానీ పాత వర్శన్ పనిచేస్తూనే ఉంటుంది. మరోవైపు జనవరి 10, 2023 తర్వాత మైక్రోసాఫ్ 365 అప్లికేషన్లు కూడా ఎక్కువ కాలం ఈ Windows 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ కు సహకరించవు. ఈ యాప్స్ మైక్రోసాఫ్ట్ మోడ్రన్ లైఫ్‌సైకిల్ పాలసీ ద్వారా నిర్వహించబడుతున్నాయి. కావున, వినియోగదారులు అప్డేట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో అప్డేట్ కానీ పాత వర్శన్ ఓఎస్ డివైజ్‌లలో Microsoft Word, Microsoft Excel మరియు ఇతర Microsoft Office అప్లికేషన్లు కూడా తాజా భద్రత మరియు సాఫ్ట్వేర్ అప్డేట్లను స్వీకరించడం ఆపివేస్తాయి.

ఇప్పటికే ఎక్స్‌ప్లోరర్‌కు ముగింపు:
మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఇటీవల తమ కంపెనీకి చెందిన వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలపై సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 2003లో 95 శాతం వినియోగ వాటాతో గరిష్ట స్థాయికి చేరుకుంది. అయినప్పటికీ, ఇతర పోటీదారుల నుండి కొత్త బ్రౌజర్ల విడుదలతో, ఆ తర్వాత సంవత్సరాల్లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ యొక్క వినియోగదారు సంఖ్య మరింత పడిపోయింది. Microsoft 365 ఆగస్ట్ 17, 2021న Internet Explorer కి సపోర్ట్ ను ముగించింది మరియు Microsoft Teams నవంబర్ 30, 2020న సపోర్ట్ ను ముగించాయి. కాగా తాజాగా Internet Explorer జూన్ 15, 2022 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

భవిష్యత్తులో ఎడ్జ్ సేవలు..
విండోస్ 10లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ భవిష్యత్తు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో ఉందని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రామ్ మేనేజర్ సీన్ లిండర్సే గతంలో చెప్పారు. ఎడ్జ్ బ్రౌజర్ వేగవంతమైనది మాత్రమే కాదు, ఇది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కంటే మరింత సురక్షితమైన మరియు ఆధునిక బ్రౌజింగ్ అనుభూతిని కలిగిస్తుంది అని ఆయన గతంలో తెలిపారు. ఇది కీలకమైన సమస్యలను కూడా పరిష్కరించగలదు: పాత, లెగసీ వెబ్సైట్లు మరియు అప్లికేషన్లకు అనుకూలంగా ఉంటుంది. కాగా, ఎక్స్‌ప్లోరర్ కు గుడ్‌బై చెప్పడంతో దాన్ని ఎక్కువగా ఉపయోగించిన యూజర్లు ఆన్లైన్ వేదికగా బాధను వ్యక్తం చేశారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086