ఊరించి, ఊరించి.. చూపించింది!

Posted By: Prashanth

ఊరించి, ఊరించి.. చూపించింది!

 

గత కొంత కాలంగా వాడివేడి ఉత్కంఠరేపుతున్న ‘విండోస్ ఫోన్ 8’ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టంను ఎట్టకేలకు మైక్రోసాఫ్ట్ వర్గాలు ఆవిష్కరించాయి. అత్యాధునిక ప్రమాణాలు కలిగి మరింత సమర్థతతో పనిచేసే ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచంలోనే శక్తివంతమైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ వోఎస్‌లో నిక్షిప్తం చేసిన అనేకమైన ఫీచర్లు... అభివృద్ధిదారులు, వ్యాపారాలు ఇంకా వినియోగదారుల కమ్యూనికేషన్ అవసరాలను వేగవంతంగా తీరుస్తాయి.

గ్యాడ్జెట్ మార్కెట్లో సర్వత్రా ఉత్సకత రేపుతున్న‘విండోస్ ఫోన్ 8’..మల్టీకోర్ ప్రాసెసర్, పెద్ద పరిమాణం కలిగిన స్ర్కీన్స్, ఫ్లెక్సిబుల్ స్టోరేజ్, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 10, ఎన్ఎఫ్‌సీ వైర్‌లెస్ షేరింగ్, బెటర్ మ్యాపింగ్, గేమింగ్ వంటి అంశాలను సమర్థవంతంగా సపోర్ట్ చేస్తుంది. ఈ వోఎస్ ద్వారా కొత్త శ్రేణి అనుభూతికి యూజర్ లోనవుతాడు. అయితే, ఇప్పటికే మార్కెట్లో విడుదలైన విండోస్ ఫోన్‌లను ఈ సరికొత్త వోఎస్ సపోర్ట్ చెయ్యదు. విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఏడాదిలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ వోఎస్‌ను, పీసీ వర్షన్ వోఎస్‌తో కలిపి ఆక్టోబర్‌లో విడుదల చేసేందుకు సాఫ్ట్‌వేర్ జెయింట్ మైక్రోసాఫ్ట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot