మైక్రోసాఫ్ట్ నూతన సీఈఓగా సత్య నాదెళ్ల

|

అంతా ఊహించినట్లుగానే మన తెలుగు తేజం సత్య నాదెళ్లను, మైక్రోసాఫ్ట్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా యాజమాన్యం ఎంపిక చేసింది. దీంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ నూతన సీఈఓ ఎంపిక పై గొతకొన్ని నెలలుగా కొనసాగుతన్న తర్జనభర్జనకు తెరపడినట్లయింది. ప్రస్తుతం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ క్లౌడ్ సర్వీసులకు నేతృత్వం వహిస్తున్నారు.

 

మైక్రోసాఫ్ట్ కంపెనీకి ప్రస్తుత సీఈఓగా వ్యవహరిస్తున్న స్టీవ్ బాల్మర్ వచ్చే ఆగష్టులో తన పదవికి రాజీనామ చేయనున్నారు. అప్పటినుంచి ఆయన స్థానంలో సత్య నాదెళ్ల కొనసాగుతారు. మైక్రోసాఫ్ట్ కంపెనీకి 39 సంవత్సరాల చరిత్ర ఉంది. కంపెనీ మొదటి సీఈఓగా బిల్ గేట్స్ వ్యవహిరించారు. రెండువ సీఈఓగా స్టీవ్ బాల్మర్ విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు స్వీకరించనున్నారు.

మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓగా సత్య నాదెళ్ల

సత్య నాదెళ్ల 1992 నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు ఈ కంపెనీతో 22 సంవత్సరాల అనుబంధముంది. 46 సంవత్సరాల సత్య నాదెళ్ల స్వస్థలం అనంతపురం జిల్లాలోని బుక్కాపురం గ్రామం. సత్య నాదెళ్ల హైదరాబాద్ వాస్తవ్యుడు. హైదారాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి. మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసిన సత్య నాదెళ్ల ఆ తరువాత ఎంఎస్ కోసం అమెరికాలోని విన్‌కాసిన్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.

ఆ తరువాత చికాగో విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ డిగ్రీని పొందారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని సత్య నాదెళ్ల 1992 నుంచి ప్రారంభించారు.సత్య నాదెళ్ల ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ బాధ్యతలను చేపడుతున్నారు. మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్ అభివృద్థిలో నాదెళ్ల కీలక పాత్ర పోషించారు.

గతంలో బింగ్ సెర్జ్ ఇంజన్‌కు నాయకత్వం వహిస్తున్న సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈఓ స్టీవ్ బామర్ 19 బిలియన్ డాలర్లు వ్యాపారమైన సర్వర్ ఇంకా టూల్స్ విభాగానికి బదలీ చేసారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టంను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే.

 

మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్నెట్ స్కేల్ క్లౌడ్ సేవలను దీనిమీదే నిర్వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో వేగవంతంగా విస్తరిస్తున్న వ్యాపార విభాగాలైన ఎంటర్‌ప్రైజ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ శాఖల్లో సత్య నాదెళ్ల కీలక సేవలందించారు. మైక్రోసాఫ్ట్‌లో చేరకముందు సత్య నాదెళ్ల సన్ మైక్రోసిస్టమ్స్‌లో పని చేసారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఒరాకిల్ ఆధీనంలో ఉంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ పదవికి ఓ తెలుగు వ్యక్తిని ఎంపిక చేయటం పట్ల తెలుగు ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X