ఆకట్టుకునే అందంతో రూపోందించబడిన మైక్రోసాప్ట్ ఆర్క్ టచ్ మౌస్‌

Posted By: Super

ఆకట్టుకునే అందంతో రూపోందించబడిన మైక్రోసాప్ట్ ఆర్క్ టచ్ మౌస్‌

మైక్రోసాప్ట్ ఆర్క్ టచ్ మౌస్ త్వరలో ఇండియాలో దర్శనమివ్వనున్న స్టైలిస్ వైర్‌లెస్ మౌస్‌తో పాటు సున్నితమైనటువంటి టచ్ వైశాల్యం కలిగినటువంటి మౌస్. కేవలం చేతి వేలుని రబ్ చేసినట్లైతే మనం డాక్యుమెంట్స్‌ని, వెబ్‌సైట్లుని చూడవచ్చు. ఇంకా దీని ప్రత్యేకతలు ఏమిటంటే బ్లూ ట్రాక్ సెన్సార్ కలిగిఉండి ఎటువంటి ఉపరితల ఏరియా మీదనైనా పని చేసే స్వబావం ఉంది. మైక్రోసాప్ట్ ఆర్క్ టచ్ మౌస్ 2.4-GHz రేడియో సామర్ద్యంతోటి మీ కంప్యూటర్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీనితోపాటు మీకు నానో రిసీవర్ కూడా కలిగిఉండి బ్యాటరీ కంపార్ట్ మెంట్‌లో స్టోర్ అయి ఉంటుంది.

ఇది మాత్రమే కాకుండా బ్యాటరీ ఇండికేటర్ కలిగిఉండి ఆన్ - ఆఫ్ స్విచ్‌‌లను కూడా కలిగి ఉంటుంది. ఇలా మొత్తం మూడు బటన్లు ఉంటాయి. మైక్రోసాప్ట్ ఆర్క్ టచ్ మౌస్ లెప్ట్, రైట్ రెండు వైపులా ఇది సిమ్మట్రిక్ టచ్ సర్‌ఫేస్‌ని కలిగి ఉంటుంది. ఇక దీనిని స్టేలిస్ మెటల్, గ్లోసరీ సర్‌ఫేస్‌లతో చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక దీని వెనుక భాగం మనకు ఎలా కావాలంటే అలా వంగిపోయే విధంగా, చేతికి గ్రిప్ ఉండే విధంగా రూపోందించడం జరిగింది. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే కేవలం రూ 3,600 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot