Microsoft Bing : ఈ యాప్‌తో ఉచితంగా AI వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చాక.. అనేక వివరాలను చాలా సులభంగా తెలుసుకుంటున్నాం. మరియు అనేక పనులను సులభంగా చేయగలుగుతున్నాం. అయితే చిన్న చిన్న వీడియోలను AI టూల్స్ ద్వారా క్రియేట్ చేయగలుగుతున్నాం. టెక్ట్స్ ప్రాంప్ట్‌లతో వీడియోలను క్రియేట్ చేస్తున్నాం. అయితే తాజాగా మైక్రోసాప్ బింగ్ కొత్త వీడియో క్రియేట్ టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉచితంగా వీడియోలను క్రియేట్ చేయవచ్చు.
ఓపెన్ ఏఐ (OpenAI) సొర మోడల్ ద్వారా ఈ వీడియో క్రియేట్ టూల్ ను డిజైన్ చేశారు. వీడియో ఎడిటింగ్ పైన ఎటువంటి అవగాహన లేకపోయినా.. సింపుల్ టెక్ట్స్ ప్రాంప్ట్‌లతో వీడియోలను క్రియేట్ చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ బింగ్ వీడియో క్రియేట్ ఫీచర్ (Microsoft Bing App) ఇవాళ్టి నుంచి బింగ్ మొబైల్ యాప్ లో అందుబాటులోకి వచ్చింది.

త్వరలో డెస్క్‌టాప్‌లోనూ..! :
ప్రస్తుతం ఈ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే ఈ వీడియో క్రియేటర్ టూల్ మైక్రోసాఫ్ట్ బింగ్ డెస్క్‌టాప్ వెర్షన్ లోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.
బింగ్ వీడియో క్రియేటర్ టూల్‌ను ఎలా ఉపయోగించాలి?
- ఆండ్రాయిడ్, iOS స్టోర్ ద్వారా బింగ్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం యాప్ ఓపెన్ చేసి, కుడివైపు కింద బాగాన ఉన్న వీడియో క్రియేటర్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- అనంతరం మీకు ఎలాంటి వీడియో కావాలో అక్కడ టెక్ట్స్ ప్రాంప్ట్ (Text Prompt) రూపంలో అందించాలి. చిన్న చిన్న పదాల రూపంలో కాకుండా.. కాస్త వివరంగా అందించడం ద్వారా మీకు నచ్చిన విధంగా వీడియోను క్రియేట్ చేసుకోవచ్చు. పూర్తి వాక్యం రూపంలో ఇన్‌పుట్‌ను అందించాలి.

- అనంతరం క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వీడియోను క్రియేట్ చేస్తుంది. వీడియో క్రియేషన్ పూర్తయ్యాక.. నోటిఫికేషన్ రూపంలో మీకు సమాచారం అందిస్తుంది. అనంతరం ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా నేరుగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. లేదా లింక్ కాపీ చేసుకొని మీకు నచ్చిన ప్లాట్‌ఫాంలో షేర్ చేసుకోవచ్చు.
- మీరు నచ్చినట్లు వీడియోలను క్రియేట్ చేయాలని భావిస్తే.. అందుకు అనుగుణంగా, స్పష్టంగా టెక్ట్స్ ప్రాంప్ట్‌లను అందించాలి, వస్తువులు, వాతావరణం సహా స్టైల్ సహా అనేక అంశాలను జోడించవచ్చు.
- దీంతోపాటు కార్టూన్, సినిమాటిక్, ఫిల్మ్ గ్రెయిన్ వంటి స్టైల్స్ లో వీడియో క్రియేట్ చేయమని టెక్ట్స్ ప్రాంప్ట్ రూపంలో అందించవచ్చు.

- ప్రస్తుతం ఈ వీడియో 9 :16 వీడియో ఫార్మాట్‌లో మాత్రమే క్రియేట్ చేయవచ్చు. త్వరలో 16:9 ఫార్మాట్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గరిష్ఠంగా 5 సెకన్ల వరకు వీడియోను క్రియేట్ చేయవచ్చు.
- ఈ యాప్‌లో భద్రత, పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. AI ట్యాగ్ ను కూడా జతచేస్తుంది. దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది.


Click it and Unblock the Notifications