మైక్రోసాప్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్ ఇప్పుడు బ్లాక్ బెర్రీ మొబైల్‌లో...

Posted By: Super

మైక్రోసాప్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్ ఇప్పుడు బ్లాక్ బెర్రీ మొబైల్‌లో...

సాప్ట్‌వేర్ గెయింట్ మైక్రోసాప్ట్, బ్లాక్‌బెర్రీ మేకర్ రిసెర్చ్ ఇన్ మోషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏమిటా ఆ ఒప్పందం అని అనుకుంటున్నారా... మైక్రోసాప్ట్ బింగ్ సర్వీసెస్‌ను బ్లాక్ బెర్రీ మొబైల్స్, టాబ్లెట్స్‌లో అనుసంధానం చేయడమే. ఈ విషయాన్ని ఫ్లోరిడాలో జరిగినటువంటి బ్లాక్‌బెర్రీ వరల్డ్ కాన్పరెన్స్‌లో వెల్లిడించారు. ఈ సందర్బంలో మైక్రో‌సాప్ట్ సిఈవో స్టీవ్ బెల్లమెర్ మట్లాడుతూ బ్లాక్‌బెర్రీ మొబైల్‌లో డిపాల్ట్ సెర్చ్ ఇంజన్‌గా బింగ్ సర్వీసెస్‌ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. బింగ్ సెర్చ్ ఇంజన్‌తో పాటుగా, బింగ్ మ్యాపింగ్ సర్వీసెస్‌ను కూడా ఇంటిగ్రేట్ చేయనున్నమని తెలిపారు.

దీనివల్ల పాట్నర్‌షిప్ వల్ల బ్లాక్‌బెర్రీ మొబైల్ డివైజెస్‌లలో డిపాల్ట్ అప్లికేషన్‌గా బింగ్ సర్చె ఇంజన్ సర్వీసెస్ మరియు బింగ్ మ్యాప్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అంతేకాకుండా ఈ పాట్నర్‌షిప్ వల్ల మైక్రోసాప్ట్ మొబైల్ సెర్చ్ ఇంజన్ స్పెస్‌లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇలా రావడం మూలాన మైక్రోసాప్ట్ గూగుల్‌కి ఇందులో కూడా ఇద్దరికి పోటీ వాతావరణం ఏర్పడుతుంది.

ఈ సందర్బంలో స్టీవ్ బెల్లమెర్ ఈ విషయాన్ని విండోస్ ఫోన్ తీసుకోని మరి బింగ్ అప్లికేషన్ ఎలా పని చేస్తుందో చూపించారు. ఈ బింగ్ అప్లికేషన్ ఫోన్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవడం మూలాన వేరే అప్లికేషన్స్ కూడా యూజర్స్‌కు ఎలా ఈజీగా ఉపయోగపడతాయో వెల్లడించారు. ఇక బింగ్ మ్యాప్స్ విషయానికి వస్తే ఇది స్ట్రీట్ వివ్ మాత్రమే కాకుండా ఫోటోలను కూడా తీసి అందిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గూగుల్ స్ట్రీట్ వివ్ ఇమేజినరీ మాదిరే ఇది కూడా పని చేస్తుందని తెలిపారు.

మొదటగా మేము ఈ పాట్నర్‌షిప్‌ని బ్లాక్ బెర్రీ మొబైల్‌తో కలవడం జరిగింది. రానున్న రోజుల్లో మా ఈ కలయిక మొబైల్ మేకర్ నోకియాతో కూడా ఉంటుందని తెలిపారు. విండోస్ ఫోన్ 7 మొబైల్ మేకర్ మైక్రోసాప్ట్ తన కొత్త సర్వీసెస్‌ను మొబైల్స్, టాబ్లెట్స్‌లోకి ఇంటిగ్రేట్ చేయనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot