మైక్రోసాఫ్ట్ మరో అద్భుతం!!

ప్రఖ్యాత కంపెనీ మైక్రోసాఫ్ట్ మరో అద్భుతానికి తెర లేపింది. ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన బ్లూటూత్ ఆధారిత మొబైల్ కీబోర్డ్ 5000ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ.3,350. ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీలతో పాటు అన్ని జనరేషన్‌ల ఐప్యాడ్‌లకు ఈ కీబోర్డును బ్లూటూత్ సాయంతో అనుసంధానించుకోవచ్చు. ఈ కీబోర్డ్ ప్రత్యేక అనుకూలతలను పరిశీలిస్తే, టైపింగ్ అనుకూలమైన భంగిమలో డిజైన్ కాబడింది. ఆపరేటింగ్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎంతటి పనినైనా అలుపెరగని శ్రమతో చక్కబెట్టేస్తారు.
కీబోర్డ్ ఫ్రధాన ఫీచర్లు:
- అల్ట్రా లైట్ వెయిట్,
- బరువు కేవలం 400 గ్రాములు,
- అత్యాధునిక బ్లూటూత్ టెక్నాలజీ,
- ధర రూ.3,350.
మోజో కార్డ్‌లెస్ ఛార్జర్‌తో మీరిక నిశ్చింత...
ప్రయాణంలో ఉన్నప్పుడే మీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా..?, ఏం పర్వాలేదు రెప్పపాటులో తిరిగి ఛార్జ్ చేసుకోవచ్చు…, అంత ఫాస్టుగా ఏలా సాధ్యమనుకుంటున్నారా..?, మార్కెట్లో విడుదలైన మోజో కార్డ్‌లెస్ ఛార్జర్ ద్వారా ఇది సాధ్యమే. ఈ పోర్టబుల్ డివైజ్‌ను మీ వెంట పెట్టకుంటే చాలు.. అత్యవసరం సమయాల్లో ఛార్జింగ్ లేదన్న బెడదే ఉండదు. ఈ పోర్టబుల్ ఛార్జర్ బాహ్య విద్యుత్ సరఫరా లేకుండా మొబైల్ ఫోన్, ఐపోడ్, ఐఫోన్, మ్యూజిక్ ప్లేయర్లతో పాటు ఇతర గేమింగ్ డివైజ్‌లను అప్పటికప్పుడే ఛార్జ్ చేసేస్తుంది.
ఈ డివైజ్‌లో పొందుపరిచిన లెవల్ ఇండికేటర్ టెక్నాలజీ, మీ గ్యాడ్జెట్ బ్యాటరీ స్థాయిని గుర్తించి క్షణాల్లో ఆ ఖాళీని భర్తీ చేస్తుంది. శక్తవంతమైన 2200mAh లియాన్ రీఛార్జబుల్ బ్యాటరీలను ఈ కార్డ్‌లెస్ ఛార్జర్‌లో నిక్షిప్తం చేయ్యటం కారణంగా విద్యుత్ నిల్వ ఉంటుంది. ఈ విద్యుత్‌ను ఛార్జింగ్ అవసరమైన వాటిలోకి చిన్న కేబుల్ ఆధారితంగా షేర్ చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో మోజో కార్డ్‌లెస్ స్పీకర్ ధర రూ.1000.


Click it and Unblock the Notifications








