మైక్రోసాఫ్ట్ బిల్డ్ కీలక నిర్ణయం.. ChatGPT డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా బింగ్
గూగుల్ I/o మరియు ఆపిల్ WWDC తరహాలో మైక్రోసాఫ్ట్ బిల్డ్ అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటి. మైక్రోసాఫ్ట్ ఈ కార్యక్రమంలో అనేక కీలక ప్రకటనలు చేస్తుంది. మరియు డెవలపర్లు, ఇతర నిపుణులతో ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తుంది. మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2023 కార్యక్రమంలో సాఫ్ట్‌వేర్ మరియు ఇతర సేవలపై ప్రకటనలు చేసింది. ఈ కార్యక్రమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై కీలక ప్రకటనలకు వేదికైంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తన యాప్‌లు మరియు సేవల్లో ఏవిధంగా వినియోగిస్తుందో వివరించింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక అంశాలను వివరించారు. అందులో కొన్నిమైనవి మీకోసం. విండోస్ 11కు copilot పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్సనల్ అసిస్టెంట్‌ను తీసుకురానుంది. ఈ విధమైన ఫీచర్ ఇప్పటికే ఎడ్జ్ బ్రౌజర్, ఆఫీస్ యాప్, గిట్‌హబ్‌లకు మైక్రోసాఫ్ట్ అనుసంధానించింది.

విండోస్ కోపైలెట్ టాస్క్‌బార్‌లో రానుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా.. ఏదైనా అంశం కోసం రాయమని లేదా వివరించమని కోపైలెట్‌ను అడగవచ్చు. వచ్చే నెలలో కోపైలెట్ ఫీచర్‌ను మరింత మందికి అందుబాటులోకి తీసుకొచ్చే ముందు.. పరీక్షించనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.
అమెజాన్ యాప్ స్టోర్‌ను ఆండ్రాయిడ్ డెవలపర్‌లు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఎవరైనా డెవలపర్‌లు తమ యాప్‌ను విడోంస్‌లో అందుబాటులో ఉంచవచ్చు. విండోస్ 11కు తమ యాప్‌లను అందుబాటులో ఉంచాలని భావిస్తారో వారంతా యాప్‌లను మైక్రోసాఫ్ట్ టెస్టింగ్‌కు పంపాల్సి ఉంటుంది.
మైక్రోసాఫ్ట్ 365 అసిస్టెంట్ ప్రధానంగా మూడు ప్లగ్‌ఇన్‌లు.. మెసేజ్ ఎక్స్‌టెన్సన్, పవర్ ప్లాట్‌ఫాం కనెక్షన్, మరియు చాట్‌జీపీటీని ఉపయోగించే టూల్‌లను సపోర్టు చేయనుంది. వినియోగదారులు థర్డ్‌పార్టీ ప్లగ్‌ఇన్‌లను కూడా ఎంపిక చేసుకోవచ్చు. చాట్‌జీపీటి కోసం ఓపెన్ ఏఐ వినియోగించే స్థాయి ప్రమాణాలతో చాట్‌జీపీటీ, కోపైలెట్ పగ్‌ఇన్‌లను రూపొందిస్తామని తెలిపింది.
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మరియు 365 కోపైలెట్ అనుసంధానం చేయనుంది. ఎడ్జ్ బ్రౌజర్‌లో ఈ టూల్‌ను గుర్తించవచ్చు. మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, వర్డ్, ఎక్సెల్ సహా మరిన్ని యాప్‌లపై పనిచేసే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈమెయిల్‌ను డ్రాఫ్ట్ చేయడం, స్పైడ్‌షీట్‌కు డేటాను అనుసంధానించడం సహా మరిన్ని ఇందులో ఉంటాయి.
గిట్‌హబ్ కోపైలెట్‌తో అనుసంధానించబడిన ఏఐ ఆధారిత చాట్‌బోట్‌తో విండోస్ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. గిట్‌హట్ కోపైలెట్‌ను వినియోగిస్తున్న డెవలపర్‌లు ఇకనుంచి నేరుగా చాట్‌బోట్‌ను వినియోగించవచ్చు. కోడ్ రికమండేషన్, తప్పులను వివరించడం వంటి పనుల కోసం ఉపయోగించుకోవచ్చు. WinDGB తరహా టూల్‌ను త్వరలో తీసుకొస్తామని తెలిపింది.
మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ChatGPT డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా బింగ్‌ను అనుసంధానించింది. త్వరలో అందుబాటులోకి రానున్న చాట్‌జీపీటీ ప్లస్‌తో కొంతమంది వినియోగదారులకు రియల్‌టైం సెర్చ్ ఇంజిన్‌కు అనుసంధానించబడి ఉంటారు. ఈ తరహాలోనే బింగ్, చాట్‌జీపీటీ అనుసంధానంతో చాట్‌జీపీటీ ప్లస్ తరహా సౌకర్యం చాట్‌జీపీటీ వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులోకి రానుంది.
మైక్రోసాఫ్ట్ ప్రకటించిన అనేక కొత్త ప్లగ్‌ఇన్‌లు త్వరలో బింగ్ చాట్‌కు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు ఎక్స్‌పీడియా, ఇన్‌స్టాకార్ట్, kayak, klarna, redfin, tripAdvisor, zillow సహా అనేక ప్లగ్‌ఇన్‌లను బింగ్‌కు త్వరలో సపోర్ట్ చేయనున్నాయి. డెవలపర్‌లు... చాట్‌జీపీటీ, బింగ్, డైనమిక్స్ 365 కోపైలెట్, మైక్రోసాఫ్ట్ 365 కోపైలెట్, విండోస్ కోపైలెట్‌లపై పనిచేసే ప్లగ్‌ఇన్‌లను రూపొందిస్తే సరిపోతుంది.
జూన్ మొదటి వారంలో విండోస్‌కు యూనిటీ ప్లేయర్ అందుబాటులోకి వస్తుంది. విజువల్ స్టూడియో 17.6 మల్టీ ప్లాట్‌ఫారమ్ యాప్ UI ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవన్ని మరింత మెరుగైన విండోస్ 11 ప్లాట్‌ఫాం అభివృద్ధి పరిచేందుకు ఉపయోగపడతాయి.


Click it and Unblock the Notifications








