బీజింగ్‌లో మైక్రోసాప్ట్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్

Posted By: Super

 బీజింగ్‌లో మైక్రోసాప్ట్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్

ప్రపంచ టెక్నాలజీ రంగంలో అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాప్ట్ కొత్తగా తన కార్యకలాపాలను, బిజినెస్‌ని ఆసియా దేశాలకు విస్తరించుకునేందుకు గాను, చైనాలోని 'బీజింగ్' కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్ సెంటర్‌ని ప్రారంభించనుంది. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్ సెంటర్ ద్వారా చైనా, ఆసియా దేశాలలో తనయొక్క బిజినెస్‌ని విస్తరించుకొవడమే కాకుండా, ఇంటర్నెట్ టెక్నాలజీలలో ఆదాయవనరులను పెంపొందించుకొనున్నట్లు సమాచారం.

ఇంటర్నెట్లో సంచరిస్తున్న వార్తల ప్రకారం మైక్రోసాప్ట్ కొత్తగా ప్రారంభించనున్న ఈ టెక్నాలజీ సెంటర్‌లో మైక్రోసాప్ట్ నాలుగు ఆన్‌లైన్ సర్వీస్‌లపై దృష్టిసారించనున్నట్లు సమాచారం. వీటిల్లో ముఖ్యంగా మైక్రోసాప్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్, ఆన్ లైన్ ఎడ్వర్టైజింగ్(యాడ్ సెంటర్), ఎమ్ఎస్ఎన్ ప్లాట్ పామ్స్‌తో పాటుగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే చైనాలో టాప్ సెర్చ్ ఇంజన్‌గా కొనసాగుతున్న 'బైదు' తో మైక్రోసాప్ట్ జులైలో చేతులు కలపడం జరిగింది. దీని వల్ల బైదు సెర్చ్ ఇంజన్ చైనా లాంగ్వేజితో పాటు, ఇంగ్లీషు భాషను కూడా సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్‌లో చూపనుంది. దీని వల్ల చైనాలో ఉన్న 450మిలియన్ ఇంటర్నెట్‌ని యూజర్స్ ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకొవచ్చు. ఇలా మైక్రోసాప్ట్ మాత్రం చైనాలో తనదైన శైలిలో దూసుకుపోతుంటే గూగుల్ మాత్రం అక్కడ స్దిరంగా నిలదొక్కుకొవడానికి మాత్రం నానాతంటాలు పడుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot