విండోస్ 7 వాడుతున్న వారికి కష్టాలు ఇక తప్పవు!!!

|

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నేటితో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ కోసం తన మద్దతును ఆపివేస్తున్నది. ఈ రోజు తర్వాత ఇప్పటికీ విండోస్ 7 ను వాడుతున్న వినియోగదారులకు సంస్థ నుండి ఎటువంటి అప్‌డేట్లు మరియు వాటి యొక్క మద్దతు లభించదు.

అప్‌డేట్
 

వినియోగదారులు మాల్వేర్ మరియు హ్యాకింగ్‌ల నుండి తమను తాము రక్షించాలనుకుంటే మీ యొక్క లాప్టాప్ మరియు కంప్యూటర్లను అప్‌డేట్ చేసుకోక తప్పదు. ముందు ముందు రాబోయే భద్రతా హ్యాకింగ్‌లు లేదా కొత్తగా కనుగొన్న బగ్‌ల నుండి రక్షించాలనుకుంటే తమ కంప్యూటర్లను విండోస్ 8.1 లేదా విండోస్ 10 కి అప్‌గ్రేడ్ చేయాలి. అదనంగా కంపెనీ తన కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను జనవరి 15, 2020 న ప్రారంభిస్తోంది. కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌కు శక్తినిచ్చే అదే ఇంజిన్ క్రోమియంపై ఆధారపడి ఉంటుంది.

వాట్సాప్ మెసేజ్ లను రహస్యంగా చదవడం ఎలా?

విండోస్ 7 మద్దతు ముగింపు వివరాలు

విండోస్ 7 మద్దతు ముగింపు వివరాలు

విండోస్ 7 సపోర్ట్ మొదటిసారిగా 2009 లో విడుదల అయింది. విండోస్ 7 ప్రారంభించినప్పుడు కంపెనీ 10 సంవత్సరాల మద్దతును వాగ్దానం చేసింది. మైక్రోసాఫ్ట్ క్రొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు మరియు కొత్త అనుభవాలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టడానికి ఈ మద్దతును నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

RS.100 కన్నా తక్కువ ధరతో స్మార్ట్ ఛానల్ ప్యాక్‌లను అందిస్తున్న టాటా స్కై

OS అప్‌గ్రేడ్

జనవరి 14, 2020 తరువాత OS ను అప్‌గ్రేడ్ చేయాలి. విండోస్ 7 వాడుతున్న ప్రతి ఒక్కరు విండోస్ 10 కి మారాలని కంపెనీ తన వినియోగదారులకు సిఫారసు చేస్తుంది. వినియోగదారులు కొత్త విండోస్ 10 లైసెన్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఇది స్పష్టం చేసింది. ఉచిత విండోస్ 10 అప్‌గ్రేడ్ జూలై 29, 2016 న ముగిసింది.

ఫ్లిప్‌కార్ట్‌లో గొప్ప ఆఫర్లతో నోకియా 55-inch స్మార్ట్ టీవీ సేల్స్

గూగుల్ క్లౌడ్
 

అదే సమయంలో గూగుల్ తన గూగుల్ క్లౌడ్ బ్లాగులో కొత్త బ్లాగ్ పోస్ట్‌ను పోస్ట్ చేసింది. ఈ బ్లాగులోని పోస్ట్‌ల భాగంగా విండోస్ 7 లో గూగుల్ క్రోమ్ మద్దతును "కనీసం జూలై 15, 2021" కు విస్తరిస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. దీని అర్థం కంపెనీ విండోస్ 7 వినియోగదారులకు మద్దతు విండోను మరింత పెంచే అవకాశం ఉంది.

ColorOS 7 ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్పష్టమైన ఆండ్రాయిడ్ స్కిన్...

మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ విండోస్ 7 అప్‌గ్రేడ్ మద్దతు కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వినియోగదారులకు కూడా ఒకేలా అందిస్తుంది. గూగుల్ క్రోమ్‌లోని మద్దతుకు సంబంధించి గూగుల్ బ్లాగ్ పోస్ట్‌ను షేర్ చేసిన కొద్ది రోజులకే ఈ కొత్త సమాచారం వచ్చింది. మైక్రోసాఫ్ట్ కొంత కోణంలో వినియోగదారులకు మద్దతునిస్తూనే ఉంటుంది. వచ్చే వారం నుండి పాత మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను కొత్త ఎడ్జ్‌తో మార్చడం ప్రారంభిస్తామని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Microsoft Disabling Windows 7 Upgrades Today

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X