అట్లాంటిక్ మహా సముద్రంలో హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్.. పూర్తి చేసిన మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌

|

మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌లు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి. ప్రముఖ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కంపెనీ Telxius సహాకారంతో అమెరికా నుంచి యూరోప్‌కు అట్లాంటిక్ మహాసముద్రం మీదగా 6,598 కిలో మీటర్ల మేర కేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఈ రెండు కంపెనీలు విజయవంతంగా నెలకొల్పగలిగాయి.

Microsoft and Facebook complete 4000-mile subsea cable

ఈ అండర్ వాటర్ కేబుల్ ద్వారా సెకనుకు 160 terabits వేగంతో ఇంటర్నెట్ డేటా ట్రాన్స్‌మిట్ కాగలదట. 'Marea'గా పిలవబడుతోన్న ఈ subsea కేబల్ వ్యవస్థ సగటు హోమ్ వెబ్ కనెక్షన్‌తో పోలిస్తే 16 మిలియన్ రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ను ఆఫర్ చేయగలదని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్‌స్పాట్‌లో పేర్కొంది.

మారియా కేబల్ వ్యవస్థ డెలివర్ చేసే సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ ద్వారా 71 మిలియన్ల హైడెఫినిషన్ వీడియోలను ఏకకాలంలో స్ట్రీమ్ చేసుకునే వీలుంటుందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. మారియా అండర్ వాటర్ కేబుల్ వ్యవస్థను కీలక సమయంలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పాటు చేసిన సబ్‌మెరైన్ కేబుల్స్ ట్రాన్స్-పసిఫిక్ రూట్‌లతో పోలిస్తే 55శాతం అదనపు డేటాను, యూఎస్-లాటిన్ అమెరికా రూట్‌లతో పోలిస్తే 44శాతం అదనపు డేటాను క్యారీ చేయగలవట.

సముద్ర గర్బంలో ఏర్పాటు చేసిన కేబుల్‌లో మొత్తం 8 జతల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఉంటాయి. ఈ మొత్తం కేబుల్స్‌ను రాగి పొర కవర్ చేస్తుంది. షిప్పింగ్ ట్రాఫిక్ ఎక్కువుగా ఉండే ప్రాంతాల్లో కేబుల్‌ దెబ్బతినకుండా భూమిలో పూడ్చిపెట్టినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

అక్టోబర్లో ఇండియా మార్కెట్‌ని శాసించేది ఈ 7 ఫోన్లే !అక్టోబర్లో ఇండియా మార్కెట్‌ని శాసించేది ఈ 7 ఫోన్లే !

సముద్రం అడుగుభాగాన ఎన్నో ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయన్న విషయం మనందరికి తెలుసు. సముద్రంలో వేసిన వైర్లతోనే ప్రపంచ దేశాల మధ్య సమాచార వ్యవస్థ నడుస్తోంది. అండర్ వాటర్ కేబుల్స్ చాలా వరకు అట్లాంటిక్ సముద్రంలోనే ఉన్నాయి.

సముద్రం గర్భంలో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయటమనేది చాలా కష్టంతో కూడుకున్న పని. తీరం దగ్గర ఉన్న కేబుల్స్.. ఒకవేళ తెగినా వాటిని రిపేర్ చేయడం సులభమే కానీ, సముద్రం మధ్యలో ఉన్న కేబుల్స్‌ను రిపేర్ చేయడం కష్టంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రపంచదేశాలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసేందుకు గాను సముద్రం అడుగుభాగాన గూగుల్ అమర్చిన కేబుల్ వ్యవస్థను ప్రమాదకర సొరచేపలు కొన్ని సంవత్సరాల క్రితం ధ్వంసం చేసాయి. ఈ సముద్ర జీవుల నుంచి తమ కేబుళ్లను కాపాడుకునేందుకు గూగుల్, ఓ రక్షణాత్మక వ్యవస్థను రూపొందించుకుంది. సముద్ర గర్భంలో ఏర్పాటు చేయబడని ఫైబర్ కేబుళ్లకు కెవ్లార్ (బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగించే మెటీరియల్) తరహా తొడుగును గూగుల్ అమర్చింది.

Best Mobiles in India

English summary
Microsoft, Facebook Complete the Highest-Capacity Subsea Cable to Cross the Atlantic. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X