రెండు స్క్రీన్ ల సర్ఫేస్ నియో పిసిని ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ న్యూయార్క్‌లో తన సర్ఫేస్ ఈవెంట్‌లో కొన్ని కొత్త పరికరాలను ఆవిష్కరించింది. మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించిన కొన్ని పరికరాలు మా అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. కానీ మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించిన వాటిలో అతిపెద్ద ఆశ్చర్యం కలిగించేది డ్యూయల్ స్క్రీన్ పిసి మరియు ఆండ్రాయిడ్ ఆధారిత సర్ఫేస్ డుయో ఫోన్. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ నియో అనేది 9-అంగుళాల డ్యూయల్ టచ్‌స్క్రీన్లు, 360-డిగ్రీల కీలు మరియు పెన్ సపోర్ట్ కలిగి ఉన్న PC. ఇది విండోస్ 10 ఎక్స్ యొక్క కొత్త వెర్షన్‌తో రన్ అవుతుంది.

2020 మొదటిలో వినియోగదారులకు ఈ కొత్త డ్యూయల్ స్క్రీన్ PCను పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. మీరు దీన్ని ఓపెన్ చేసినప్పుడు దీని యొక్క స్క్రీన్ పూర్తి-పరిమాణం 13-ఇంచ్ గా ఉంటుంది. ఇది గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇప్పటివరకు సృష్టించిన సన్నని ఎల్‌సిడి PCగా దీనిని అభివర్ణిస్తుంది. సర్ఫేస్ నియో ఇంటెల్ లేక్‌ఫీల్డ్ ప్రాసెసర్ ,11 వ జెన్ గ్రాఫిక్స్ ఇంజిన్ ద్వారా నిర్మించబడింది..

ఈ PCను మైక్రోసాఫ్ట్ యొక్క కొత్త సర్ఫేస్ పెన్‌తో కూడా ఆపరేట్ చేయవచ్చు. ఈ పెన్ వెనుక జతచేయబడి ఉంటుంది. దీనికి వండర్‌బార్ అనే టచ్ ఇంటర్‌ఫేస్ కూడా ఉంది. ఆసక్తికరమైన మరొక విషయం ఏమిటంటే కీబోర్డ్ రెండు స్క్రీన్ లకు వేరు వేరుగా ఉంటుంది. కానీ స్క్రీన్స్ రెండు అయస్కాంతంగా వెనుకవైపు జతచేయబడి ఉంటాయి. మీరు దాన్ని మడవవచ్చు మరియు రెండు డిస్ప్లేలలో ఒకదాని పైన మరొకటి కూడా ఉంచవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎడమ వైపు ఇన్పుట్ ఎంపికలను చూపించే స్క్రీన్ మీకు కనిపిస్తుంది. మీరు దీనిని ట్రాక్‌ప్యాడ్‌గా కూడా ఉపయోగించవచ్చు. రెండు స్క్రీన్‌ల పూర్తి వీక్షణను కోరుకుంటే వినియోగదారులు కీబోర్డ్‌ను విడిగా ఉపయోగించగలరు.

వీటితో పాటు కంపెనీ తన తాజా సర్ఫేస్ ల్యాప్‌టాప్ 3, సర్ఫేస్ ప్రో 7 టాబ్లెట్ మరియు సర్ఫేస్ ఇయర్‌బడ్స్ ను కూడా విడుదల చేసింది. కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్ 3 సిరీస్‌లో భాగంగా ఇవి 13.5-అంగుళాల మరియు 15-అంగుళాల డిస్ప్లే వేరియంట్ తో లభిస్తుంది. ఇవి రెండు వేరియంట్లు 10 వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో వస్తాయి. ఈ ల్యాప్‌టాప్ సిరీస్ ను మ్యాప్‌డ్ అల్యూమినియం ఫినిష్, శాండ్‌స్టోన్ మరియు కోబాల్ట్ కలర్ లలో కంపెనీ ప్రవేశపెట్టింది.

మైక్రోసాఫ్ట్ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ BUILD 2020 లో సర్ఫేస్ డుయో గురించి మరింత లోతుగా డైవ్ చేసే అవకాశం ఉంది. డిజైన్‌ను నిశితంగా పరిశీలిస్తే మైక్రోసాఫ్ట్ దీనిని శామ్‌సంగ్, హువాయి వంటి ప్రత్యర్థులకు పోటీగా తీసుకువెళుతున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ క్రోమియంతో తన ప్రయత్నాలను ప్రతిబింబించే AOSP అభివృద్ధికి చురుకుగా సహకరించడం ప్రారంభించవచ్చని దీని అర్థం. గత ట్రాక్-రికార్డ్‌ను పరిశీలిస్తే AOSP కు సహకరించడానికి చురుకుగా పనిచేయడానికి ఎటువంటి ప్రణాళికలను కంపెనీ వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








